YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వకీల్ సాబ్ అభిమానుల సందడి

వకీల్ సాబ్ అభిమానుల సందడి

పాయకరావుపేట
శుక్రవారం భారీ అంచనాలతో మూడు సంవత్సరాలు తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల అవుతుండడంతో తుని,పాయకరావుపేట జంట నగరాల్లో పవన్ ఫాన్స్ సినీ పండుగ వాతావరణం నెలకొంది.పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సినిమా శుక్రవారం విడుదల కావడంతో పవన్ ఫాన్స్ పాయకరావుపేటలో సందడి చేశారు. హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా అసలు కథకు కొన్ని మార్పులు చేర్పులు జోడించడం జరిగింది. శృతి హాసన్ పవన్ కి జంటగా నటించగా.. అంజలి, నివేదా థామస్ కథలో కీలకమైన రోల్స్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.పవన్ కళ్యాణ్ స్త్రీల పై జరుగుతున్న అన్యాయాలపై న్యాయవాదిగా నటించి,వాదించడంలో అద్భుతమైన నటన కనబర్చారని అన్నారు పాయకరావుపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను.ఉదయం నుండే తుని,పాయక రావుపేట పట్టణాల్లో పవన్ ఫాన్స్ టపాసులు కాలూస్తూ చిత్రం విడుదల,చిత్రం సూపర్ హిట్ అయినందుకు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Related Posts