YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖలపై ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కౌంటర్

స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖలపై ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కౌంటర్

న్యూ డిల్లీ ఏప్రిల్ 9
దేశంలో ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరగడానికి కారణం మహిళల వస్త్రధారణే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అందరూ ఇమ్రాన్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖలపై తాజాగా ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలను ఖండించారు.వారాంతంలో లైవ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. అత్యాచారాల పెరుగుదల అశ్లీలత అసభ్యత పెరుగుతున్న ఏ సమాజంలోనైనా పరిణామాలను సూచిస్తుంది అని అన్నారు. సమాజంలో మహిళలపై అత్యాచార ఘటనల పెరుగుదల చాలా వేగంగా ఉంది.. ఉద్రేకానికి తావిచ్చేలా వస్త్రధారణ ఉండొద్దని సలహా ఇస్తున్నాను. పర్దా ఈ మొత్తం భావన ఉద్రేకానికి దూరంగా ఉండటమే దానిని నివారించడానికి ప్రతి ఒక్కరికీ సంకల్ప శక్తి లేదు నిరాడంబరమైన డ్రెస్సింగ్ లేదా స్త్రీ పురుష మధ్య విభజన అనే పదాలను వాడుతారు అని అన్నారు.అయన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన జెమిమా గోల్డ్ స్మిత్ .. కళ్లను నిరోధించి ప్రైవేట్ భాగాలను కాపాడే బాధ్యత పురుషులపై ఉంది. ఖురాన్ 24: 31 ఇదే చెబుతుందని ఈ వ్యాఖ్య నమ్మేవారికి చెప్పండి అంటూ ఇమ్రాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తప్పుడు వ్యాఖ్యేనని ఇమ్రాన్..  స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి. అంటూ ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై పాకిస్తాన్ తోపాటు పలు దేశాల ప్రజలు హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో ఓ క్యాంపెయిన్ సైతం చేపట్టారు. అయితే రెండుసార్లు విడాకులు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ ముందు తననుతాను మారాలంటూ అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
 

Related Posts