ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భారీ కుట్ర జరిగిందా..? ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలు జనసేనానిపై కుట్రపన్నాయా? అంటే తాజాగా పార్టీ ఆరోపణలు చూస్తే అక్షర సత్యమనిపిస్తోంది. అసలు ఈ కుట్రపన్నిందెవరు..? ఎందుకు? అసలు నిఘా వర్గాల్లో నిగ్గు తేలిన నిజానిజాలేంటి? అసలు ఆ కిరాయి మూకలను ఏపీకి రప్పించాలనుకుందెవరు? అనే విషయాలను మాత్రం జనసేన పార్టీ బయటపెట్టలేకపోయినప్పటికీ.. కొన్ని వివరాలను మాత్రం తన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. జనసేన పార్టీపై ప్రజలు చూసిస్తున్న ఆదరణ చూసి భయపడి కొన్ని స్వార్థపూరిత శక్తులు దుష్ట పన్నాగాలు పన్నుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు ఇటీవల పసిగట్టిన కొన్ని ఉదంతాలే దీనికి తార్కాణమని పేర్కొంది. తమపై, తమ పార్టీపై కుట్ర జరుగుతోందంటూ జనసేన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా ఏదో ఒక కుట్ర జరుగుతోందని జనసేన ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి సదరు ప్రకటనలో పేర్కొన్నారు.నిఘా వర్గాల హెచ్చరికతో పవన్ కళ్యాణ్ ఆగిపోయారని.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ‘తుని రైలు విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడి జనసేన పార్టీకి చెడ్డపేరు తీసుచ్చేలా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించి సమాచారం అందించాయి. పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలను తెచ్చి అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేన పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి భయపడిన కొన్ని స్వార్థపూరిత శక్తులు దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘా వర్గాలు పసిగట్టాయి. ఏప్రిల్‌లో చిత్తూరు, గుంటూరు జిల్లా బాపట్లలో పవన్ కల్యాణ్ తలపెట్టిన కార్యక్రమంలో తునిల్ జరిగిన రైలు విధ్వంసం వంటి చర్యలకు పాల్పడి జనసేనకు అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థపరశక్తులు సంప్రదించినట్లు నిఘా వర్గాలు పార్టీ నేతలను అప్రమత్తం చేయడంతో ఈ రెండు జిల్లాల్లో తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేశారు" అని జనసేన స్పష్టం చేసింది.తొలుత ఈ నెల 21, 22, 23 తేదీల్లో పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలను పార్టీ సిద్ధం చేసింది. శెట్టిపల్లిలో భూసేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైరోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి ప్రజాసమస్యలపై ఆయన పర్యటన షెడ్యూల్‌ను పార్టీ సిద్ధం చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లా స్టూవర్టుపురం నివాసి అయిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వెంకట్ రాహుల్ కామన్వెల్త్ పోటీల్లో బంగారు పతకం సాధించిన సందర్భంగా ఈ నెల 30న స్టూవర్టుపురం నుంచి ఊరేగింపు, అనంతరం బాపట్లలో పౌరసన్మానాన్ని చేయాలని పవన్ తలపెట్టారు. అయితే ఈ రెండు జిల్లాల కార్యక్రమాల కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసుకోవడం జరిగింది" అని జనసేన పేర్కొంది.జిల్లాల్లోని ప్రధాన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు, ప్రత్యేకహోదా సాధన ధ్యేయంగా జిల్లాల్లో పర్యటిస్తానని సమావేశంలో పవన్ చెప్పారు. తన సుధీర్ఘ పర్యటనల కోసం వివిధ కమిటీలను పార్టీ ముఖ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని జనసేన స్పష్టం చేసింది. అయితే జిల్లాల్లో పర్యటన రెండు మూడు వారాల్లో ప్రారంభం అయ్యే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. మున్ముందైనా నిజానిజాలు బయటికి వస్తాయో లేకుంటే అలానే మూలన పడిపోతాయో వేచి చూడాల్సిందే మరి.