YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పువ్వు బరువు ... కల్మషము లేని భక్తి

పువ్వు బరువు ...   కల్మషము లేని భక్తి

ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ వూరి రాజు గారు జగన్నాథుని ఆలయం కి వెళ్ళారు. అది సాయంత్రం వేల.. అప్పటికి చాలా ఆలస్యం అయింది.. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద ఉన్నవన్నీ అమ్మేసినాక కేవలం ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలి ఉంది. రాజు గారు ఆ పువ్వుని అడిగారు.. ఆమె ఆ పువ్వుని అయనికి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు రేటు ఇస్తాను ఆ పువ్వుని ఇమ్మని అన్నాడు. అప్పుడు ఆ ఒక పువ్వు కోసం వరుస వేలం ప్రారంభమైంది. చివరికి.. రాజు గారు తన మొత్తం రాజ్యాన్ని పూల దుకాణం ఆమెకు ఇచ్చి ఆ ఒక పువ్వును వేలంలో దక్కించుకొని.. పువ్వును జగన్నాథుడికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుడి లా పడుకున్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజు గారి కలలోకి వచ్చి.. అంతటి బరువును మోయలేను.. ఆ పువ్వును తన తల నుండి తొలగించమని కోరారు. అప్పుడు ఆ రాజు జగన్నాథుడుని... స్వామి.. ఈ సృష్టి మొత్తాన్ని చిటికిన వేలుతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారం అయినది.. అని అడిగారు. అప్పుడు జగన్నాథుడు.. రాజా.. నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కాని నీ భక్తి యొక్క బరువు నేను మోయ్యలేనిది.. రాజా.. నా మీద భక్తి తో.. నాకు అర్పించడం కోసం ఒక పువ్వును పొందటానికి నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసావు.. ఇంతటి భారీ మూల్యము గల భక్తిని మోయ్యడము చాలా కష్టం అని చెప్పి...
నీ రాజ్యం లేని నీవు రేపు ఎలా బ్రతుకుతావు అని కూడా అలోచించకుండా నీ కల్మషము లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు.. నీ భక్తికి చాలా సంతోషము.. వెల్లి నీ రాజ్యాన్ని నీవే ఏలుకో.. అని చెప్పి ఆ జగన్నాథుడు మాయమైపోయారు...
భగవంతుడు ఎల్లప్పుడు భక్తులు యొక్క కల్మషము లేని భక్తికి సంతోషించి భక్తుడని ఆశీర్వదిస్తారే కానీ.. కల్మషమైన స్వార్థ పూరిత భక్తితో పూజించేవారికి ఎప్పుడూ సమయం ఇవ్వరు..
ఓం నమో నారాయణాయ.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts