YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం

ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం

అదిలాబాద్ జిల్లా సాధారణ సాగు 2.01లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు  అంచనా వేశారు. పత్తి, కంది, సోయా, పెసరమినుములు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పత్తి- జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తి విత్తనాలకు రైతులు పూర్తిగా ప్రైవేట్‌ వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గత ఏడాది పత్తి 1.23 లక్షల హెక్టార్లు సాగు కాగా ఈ ఏడాది ఇంకా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు సక్రమంగా, సకాలంలో అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.. ఖరీఫ్‌కు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.. ఈ మేరకు కూపన్ల జారీ, విత్తన పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.పలు కంపెనీలు వందల రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచుతాయి. ఇంకా అమ్మకాలు మొదలుకాకముందే నకిలీ విత్తనాలు మార్కెట్‌లో ప్రవేశించాయి.. అధికారుల లెక్కల ప్రకారం ఏటా అయిదు లక్షలకు పైగా విత్తన సంచులఅమ్మకం అవుతాయని అంచనా. గతంలో విత్తన సంచి ధర రూ.800ఉండేది. అలాంటిది ఈ ఏడాది విత్తన ధర రూ.60 తగ్గించడంతో విత్తన సంచి ధర రూ.740కే రైతులకు లభ్యమవుతోంది.సోయా- పత్తి తరువాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది సోయా పంటనే. జిల్లాలో ఈ ఏడాది 38వేల హెక్టార్లలో పంట సాగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను 30వేల క్వింటాళ్ల విత్తనాలు అవుసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ విత్తనాలు 33 శాతం రాయితీపై ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయనుంది. గత ఏడాది ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన విత్తన రకాల్లో దిగుబడి తక్కువగా వచ్చిందని రైతులు మొరపెట్టుకున్న అవే రకాలు ఇస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జెఎస్‌335, జెఎస్‌9035 రకాలతో పాటు పరిశోధన స్థానంకు సంబంధించిన బాసర, భీం రకాలు పంపిణీ చేస్తున్నారు. రైతులు కోరుకునే విత్తన రకాలను తెప్పించి రాయితీపై పంపిణీ చేస్తే ప్రయోజనంగా ఉంటుంది.కంది- పత్తికి ప్రత్యామ్నయంగా ఈ ఏడాది కంది సాగు విస్తీర్ణం ఎక్కువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది 16 హెక్టార్లు ఉన్న కంది సాగు ఈ ఏడాది 20వేల హెక్టార్లకు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను రాయితీపై పంపిణీ చేసేందుకు 1489 క్వింటాళ్ళ విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.

Related Posts