YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మిల్లెట్స్ తో ఆదాయం

మిల్లెట్స్ తో ఆదాయం

నిజామాబాద్, ఏప్రిల్ 10, 
కరకరలాడుతూ నోరూరించే మిల్లెట్స్‌ కావాలంటే ఇక గండీడ్‌కు వెళ్లాల్సిందే.. రూ.28 లక్షల రూర్బన్‌ నిధులతో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిదైన ఈ కేంద్రాన్ని గురువారం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలతో మురుకులు, బిస్కెట్లు, లడ్డూలు, రవ్వలడ్డు, మిక్చర్‌, అప్పడాలు, రొట్టెలు, పాయసంతోపాటు మొత్తం 22 రకాల రుచికరమైన పదార్థాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి.మహిళా సంఘాల ఆధ్వర్యంలో దేశంలోనే తొలి మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ మ హబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలకేంద్రంలో గురువారం ప్రారంభించారు. పాలమూరు వ్యవసాయ ఉత్పత్తుల పరస్పర సహాయ సంఘం ఆధ్వర్యంలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్వహించనున్నది. రూ. 28 లక్షల రూర్బన్‌ నిధులతో చేపట్టిన ఈ యూని ట్‌ దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఓవైపు చిరుధాన్యాల వి నియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. మరోవైపు వాటి లభ్యత కష్టమవుతున్నది. చిరుధాన్యాలు పండించే రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో బాగా పండే చిరుధాన్యాల రైతులకు లాభాలతోపాటు వాటిని మార్కెటింగ్‌ చేసి ప్రజల కు చక్కని పౌష్టికాహారం అందించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అధికారులు చెబుతున్నారు.జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సా మలు, అరికెలు, ఊదలు.. ఇవీ చిరుధాన్యాలు. వీటిని ప్రాసెసింగ్‌ చేసి విక్రయిస్తే రైతులకు చక్కని గిట్టుబా టు అవుతుంది. ఉదాహరణకు కిలో కొర్రలు నేరుగా విక్రయిస్తే రూ.30.. వాటి ని ప్రాసెస్‌ చేసి కొర్ర బి య్యంగా మార్చి విక్రయిస్తే త క్కువకు తక్కువ కిలోకు రూ.70 వరకు గిట్టుబాటు అవుతుంది. ప్రాసెస్‌ చేసిన తర్వాత నోరూరించే ఆహార పదార్థాలుగా మార్చి అమ్మితే లాభాలు మరింత పెరుగుతాయి. ఈ మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ చేసి విక్రయించడమే కాకుండా వాటిని విలువ ఆధారిత (వాల్యూ యాడెడ్‌) ఆహార పదార్థాలుగా మార్చి విక్రయిస్తే ఆకర్షణీయమైన లాభాల కు అవకాశం ఉం టుంది. మిల్లెట్స్‌ నుంచి మురుకులు, బిస్కె ట్లు, లడ్డూ లు, రవ్వల డ్డు, మిక్చర్‌, అప్పడాలు, రొట్టెలు, పా యసం.. తదితర రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్టాళ్లలో విక్రయించనున్నారు. ఇందుకోసం రూ. 28 లక్షలతో దేశంలోనే తొలిసారిగా ఓ మహిళా సంఘం ఆధ్వర్యంలో గండీడ్‌లో మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు.సెంటర్లో మూడు రకాల చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యం త్రాలు, రోటీ మేకింగ్‌ యంత్రం, మిల్లెట్‌ బిస్కెట్‌ యూనిట్‌, మురుకుల తయారీ యంత్రాలున్నా యి. హైదరాబాద్‌కు చెందిన స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్‌ ద్వారా స్థానిక మహిళలకు మిల్లెట్స్‌ ప్రా సెసింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ తయారు చేసే ఆహార పదార్థాలను మహా బ్రాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా కూడా విక్రయించేందుకు ఏర్పాట్లు చే స్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఫుడ్‌ లైసెన్స్‌, జీఎస్టీ సైతం సిద్ధం చేసుకున్నారు. రెండు మూడు రకాల మిల్లెట్స్‌ మిక్స్‌ చేసి తయారు చేసే రుచికరమైన స్నాక్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని అ ధికారులు చెబుతున్నారు. ఆరు నెలల తర్వాత పసిపిల్లలకు ఫుడ్‌ సప్లిమెంట్‌లాగా ఇచ్చే సెరిలాక్‌, ఫారెక్స్‌ వంటి ఇన్‌స్టంట్‌ మిక్స్‌కు ప్రత్యామ్నాయం గా మిల్లెట్‌ మిక్స్‌ తయారుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బలవర్ధకమైన మిల్లెట్‌ మిక్స్‌ పౌడర్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారుప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించేం దుకు ప్రతి మండలంలోనూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెం టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచి స్తున్నది. రూర్బన్‌ కింద గండీడ్‌ మండలంలో మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. దీంతో రైతులకు, మహిళా సంఘాలకు ప్రయోజనం చేకూరడంతోపాటు ప్రజలకు పౌష్టికాహారం అందనున్నది. ప్రాసెసింగ్‌ సెంటర్లో పనిచేసేందుకు 30 మంది మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నాం. మిల్లెట్స్‌ నుంచి ప్రాసెస్‌ చేసిన తర్వాత తయారుచేసే వ్యాల్యూ యాడెడ్‌ ఆహార పదార్థాలు చాలా మంచిది. అన్ని మండల కేంద్రాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే స్టాల్స్‌తో సైతం మహిళలకు ఉపాధి లభిస్తుంది. మిల్లెట్స్‌తో చేసిన ఆహార పదార్థాలను మహా బ్రాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తాం. స్థానికంగా సూపర్‌ మార్కెట్లు, హోల్‌సేల్‌ దుకాణాల్లో అమ్ముతాం. శుభకార్యాల్లో వెజిటేరియన్‌ కోసం ఆర్డర్‌ ఇస్తే అన్ని ఆహార పదార్థాలు ఇక్కడి నుంచి సరఫరా చేస్తామంటున్నారు.

Related Posts