YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

వర్క్ ఫ్రమ్ హోమ్ తో కొత్త సమస్యలు

వర్క్ ఫ్రమ్ హోమ్ తో కొత్త సమస్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 10, 
కరోనా సెకండ్ వేవ్తో ఐటీ ఉద్యోగులు పరేషాన్ అవుతున్నారు. లాక్డౌన్ తొలి రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం బాగానే ఉందనుకున్నా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, వ్యాక్సిన్ కూడా వచ్చిందని ఖుషీ అవుతున్న టైమ్లోనే సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో వర్క్ఫ్రమ్ హోం ఎక్స్టెండ్ అయి టెన్షన్కు గురవుతున్నారు. మార్చిలో ఫుల్స్టాఫ్తో ఆఫీసులు స్టార్ట్ చేయాలనుకున్న కంపెనీలు తమ డెసిషన్ను జూన్కు పోస్ట్పోన్ చేశాయి. జూన్లో స్టార్ట్ కావాల్సిన కంపెనీలు ఇయర్ ఎండ్ వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని స్టాఫ్కు చెప్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని ఎమ్మెన్సీలైతే  ఓపిక ఉన్నన్ని రోజులు ఇంటి నుంచే పని చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఐటీ ఎంప్లాయీస్ మాత్రం వర్క్ ఫ్రం హోం వల్ల  ఫిజికల్, మెంటల్ సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డాక్టర్లను కలిసి కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఏడాదిగా ఇంటి నుంచే పని గత ఏడాది మార్చిలో లాక్డౌన్తో హైదరాబాద్లోని అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ను ఇచ్చాయి. ఆ టైంలో బయట రాష్ట్రాల వాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడి వాళ్లు కూడా కొందరు సిటీలో ఎందుకని తమ పల్లెలకు పయనమైపోయారు. కొందరు మాత్రమే సిటీలో ఉండిపోయారు. తొలుత అందరూ హాయిగా ఇంటి నుంచి ఆడుతూ పాడుతూ పని చేశారు. ఈ ఆప్షన్ చాలా బాగుందని మురిసిపోయారు.  కొన్నిరోజుల నుంచి ఎప్పుడెప్పుడు దీన్నుంచి బయటపడతామా అంటూ ఎదురుచూస్తున్నారు. లాంగ్ వర్కింగ్ అవర్స్ అవుతున్నాయని, వీకెండ్లో కూడా వర్క్ చేయాల్సి వస్తోందని, గంటల తరబడి ఫోన్ కాల్స్లో ఉండాల్సి వస్తోందని, ఇంటర్ పర్సనల్ స్కిల్స్  దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు. ఇంట్లోనే నెలల తరబడి ఉండడం వల్ల విసిగిపోతున్నామంటున్నారు. నిద్ర కూడా పట్టక అనారోగ్యం పాలవుతున్నామని చెప్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్కు వర్క్ ఫ్రం హోం మొదలై ఏడాది దాటిపోయింది.
హైదరాబాద్లో చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు కలిపి పదిహేను వందలు ఉంటాయి. వీటిలో ఆరు లక్షల మంది పని చేస్తుంటారు. మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు దేశీయ స్థాయిలో చిన్నా పెద్ద కంపెనీల్లో వందల నుంచి వేలాది మంది పని చేస్తుంటారు. విశాలమైన ఆఫీసులు, అట్రాక్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్, క్యాంటీన్లు, కెఫెటేరియాలతో ఐటీ ఉద్యోగుల లైఫ్ సందడిగా గడిచేది. కరోనా, లాక్డౌన్‌లతో  అందరూ ఇంటి నుంచి పని చేయాల్సి వచ్చింది. అన్లాక్లో భాగంగా నాన్ ఐటీ సెక్టార్లో ఆఫీసులు తెరుచుకున్నా, ఐటీలో మాత్రం వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో కొన్ని చిన్న కంపెనీలు ఆఫీసులు తెరిచాయి. కొంచెం పెద్ద కంపెనీలు మార్చి తర్వాత తెరుద్దామని అనుకున్నాయి. కాకపోతే ఎమ్మెన్సీలు మినహా కంపెనీలన్నీ ఫిబ్రవరి నాటికి 10%, మార్చి నాటికి 15% స్టాఫ్ను  ఆఫీసులకు పిలిచాయి. వ్యాక్సిన్ ఎలాగూ వచ్చిందని ఏప్రిల్లో దీన్ని 25- నుంచి 30 శాతానికి పెంచాలని అనుకున్నాయి. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ని చూసి రిస్క్ ఎందుకని ముందుగానే వర్క్ ఫ్రమ్ హోం కంటిన్యూ చేయాలని ఉద్యోగులకు సమాచారమిస్తున్నాయి. నెలల తరబడి ఇంటి నుంచే పని చేయడం, పొద్దస్తమానం పనిలోనే ఉండాల్సి రావడంతో ఐటీ ఉద్యోగులు అనారోగ్యం బారినపడుతున్నారు. మెంటల్ స్ట్రెస్కు గురవుతున్నారు. ఆఫీసులో వర్క్ అయితే పర్టిక్యులర్గా టైమింగ్స్ ఉంటాయి. లంచ్ అవర్, టీ బ్రేక్ అని కొంత డైవర్షన్ ఉంటుంది. వర్క్ ఫ్రం హోం వల్ల  పొద్దున్నుంచి రాత్రి పది, పదకొండు వరకు పని చేయాల్సి వస్తోందని,  శనివారం కూడా పనిలో ఉండాల్సి వస్తోందని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్, ఇరిటేషన్, డ్రై ఐస్, ఒబేసిటీ, ఇన్సోమ్నియా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల వచ్చే ఇబ్బందులతో తమను చాలా మంది ఐటీ ఉద్యోగులు కలుస్తున్నారని సైక్రియాటిస్టులు చెప్తున్నారు. కొన్ని రిలాక్సేషన్  టెక్నిక్లు చెప్పి వాళ్లకు కౌన్సెలింగ్ చేస్తున్నామని అంటున్నారు.

Related Posts