కర్నూలు ఏప్రిల్ 10,
ఆత్మకూరు మండలంలో అశ్లీల నృత్యాలు వివాదంగా మారాయి. ఇతర ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో డ్యాన్సులు చేయించారు. ఈ నృత్యాలు రాత్రి నుండి తెల్లవారు వరకు కొనసాగాయి. అత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఉరుసు ఉత్సవాలలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసారు. పవిత్రంగా జరగవలసిన ఉరుసులో అపవిత్ర అశ్లీల నృత్యాలు నిర్వహించి ఆచారాలను భ్రష్ఠు పట్టించారని విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది వైసిపి నాయకులే అశ్లీల నృత్యాలు నిర్వహించరని ఆరోపణలు వచ్చాయి. స్థానికులు వైస్సార్సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎనిమిది మంది అమ్మాయిలను పిలిపించి రాత్రి 10 గంటల నుండి తెల్లవారు జాము దాకా అశ్లీల నృత్యాలతో డాన్సులు వేయించారని అంటున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా వేల మంది వచ్చారని అంటున్నారు. ప్రోగ్రామ్ ను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా కనుచూపుమేర పోలీసులు లేరని విమర్శలు వచ్చాయి. అధికారులకు తెలిసిన చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి