YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస, కాంగ్రెస్ లకు తేడా లేదు

తెరాస, కాంగ్రెస్  లకు తేడా లేదు

నల్గొండ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ది తరుపున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. త్రిపురారం మండలం, పెద్ద దేవులపల్లి లో కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.  మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు ఏ మాత్రం తేడా లేదు..కాంగ్రెస్ లో గెలిస్తే మళ్ళీ టిఆర్ఎస్ లోకే వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటేసిన టిఆర్ఎస్ కు ఓటేసిన రెండు ఒకటే. తెలంగాణ లో  కుటుంబ పెత్తనం సాగుతోంది..ఒకటి ఓవైసీ కుటుంబం, మరొకటి కేసీఆర్ కుటుంబం. సాగర్ ప్రజలను కోరుతున్నా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకి బుద్ది చెప్పాలని. టిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారింది...అప్పు అభివృద్ధి కోసం చేయాలి కానీ కుటుంబం బాగు కోసం చేస్తున్నారని అన్నారు.
మోదీ ప్రధాని అయిన తరువాత కరెంట్ కొరత ఎరువుల కొరత లేదు. రైతులకు, పొదుపు సంఘాలకు కేంద్రం నిధులు ఇస్తుంది. కరోనా మహమ్మారి సందర్బనగా కేంద్ర ఉచితంగా కరోనా టీకా ఇస్తుంది. ప్రపంచంలో కోట్లాదిమంది కరోనా తో ఇబ్బంది పడుతుంటే పెద్దన్నగా కరోనా టీకా అందిస్తున్నాం. పేద కుటుంబానికి చెందిన రవిని గెలిపించాలి. ఇపుడు కాకపోయినా ముందు ముందు టిఆర్ఎస్ పాలన పోయి బిజెపి అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఈ ఎన్నికల్లో చైతన్యం గా ముందుకు ప్రతిఒక్కరు రావాలి. ఈ రాష్ట్రములో కేసీఆర్ కు, కేసీఆర్ కొడుకు, కూతురు, బంధువులకు మాత్రమే న్యాయం జరిగింది..సామాన్య మానవునికి అన్యాయం జరిగింది. జానా రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి. టిఆర్ఎస్ కు బి టీం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే ఎంత మంది ఏంమ్యెల్యే లు మీ పార్టీలో ఉన్నారో జానా రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు.

Related Posts