కర్నూలు
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర జరిపిన వాహన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో 3 కోట్ల 5 లక్షల 35 వేల రూపాయల డబ్బు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. పట్టుబడిన సొమ్ము.. చెన్నైలోని రామచంద్రా మెడికల్ కాలేజీకి సంబంధించినదని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇక బంగారం హైదరాబాద్ జేమ్స్ అండ్ జ్యూయలర్స్కు చెందినదిగా గుర్తించారు. ఈ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బంగారాన్ని కర్నూలుకు తరలిస్తున్నట్లు తెలిపారు అధికారులు.హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున బంగారం, నగదు తరలివెళ్తున్నట్లుగా సమాచారం అందడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.