YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు అడ్డుకుంటాం - సీపీఐ , సీపీఎం

విశాఖ నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు అడ్డుకుంటాం - సీపీఐ , సీపీఎం

విశాఖ
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేసి ఆ భూములను పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకు ఉపయోగకరమైన వాటికి వినియోగించాలి తప్ప ఎ పి బిల్డ్ పేరిట అమ్మడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి సీపీఎం నగర కార్యదర్శి 78 వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు లు తెలిపారు విశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ భూములను అమ్మడాన్ని ఖండిస్తూ సీపీఐ సీపీఎం పార్టీలు సంయుక్తంగా విశాఖ బీచ్ రోడ్డులో గతంలో లూలూ సంస్థ కు కేటాయించిన ఎ పి ఐ ఐ సి భూమిలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా లో సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన  విశాఖ ను రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం రాజధాని గా మారనుందన్న ఉత్తరాంధ్ర వాసుల ఆనందం కొంతకాలమైనా నిలవకముందే  స్థానిక ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా విశాఖ నగరంలోని అత్యంత విలువైన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం బాధాకరమని అంతంతమాత్రంగానే మిగిలి ఉన్న కొద్దిపాటి భూములను బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ పేరిట విక్రయించే ప్రయత్నాలను విశాఖ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.విశాఖ లో గత ప్రభుత్వం లూలూ మాల్ కు కేటాయించిన ఆర్ కే బీచ్ లోని 13.59 ఎకరాలతో పాటు 18 ల్యాండ్ పార్సిల్స్ కు చెందిన 17.37 ఎకరాల అమ్మకానికి 1469.77 కోట్ల రిజర్వ్ ధరతో ప్రయత్నాలు విరమించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం బడ్జెట్ సపోర్టు పేరిట ప్రభుత్వభూములు అమ్మకాలు వామపక్షాలు అడ్డుకున్నాయని అప్పుడు ప్రతిపక్ష పార్టీ గా వైసీపీ వ్యతిరేకంగా మాతోపాటు ఆందోళనలో పాల్గొన్నారని తీరా అధికారంలోకి రాగానే ద్వంద వైఖరి అవలంభించడం అన్యాయం అని ఈ భూములు కాపాడడానికి అందరినీ కలుపుకుని ఐక్య ఉద్యమం చేస్తామని తెలిపారు. 
సీపీఎం నగర కార్యదర్శి 78 వార్డు కార్పొరేటర్డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ లోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని వందల ఎకరాలను గత ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పంపకాలు చేయడం లేదా అమ్మకాలు చేశాయి. రాజధాని విశాఖ కు తరలి వస్తున్న సందర్భంలో ప్రభుత్వ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ఏర్పాటుచేయాల్సిన కార్యాలయాలకు భూములు అవసరం ఉంటుంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా నిధుల సమీకరణ పేరిట ఉన్న భూములను విక్రయించడం దారుణం.విశాఖ లోని ఫకీరు తక్యా ప్రభుత్వ భూమి,  బీచ్ రోడ్ లోని ఏ పీ ఐ ఐ సీ  భూమి, అగనంపూడిల్లో  భూముల ను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూముల విక్రయాలను తక్షణమే నిలిపివేసి నగర పాలక సంస్థ కు వాటిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.విలువైన భూములు ఒక్క గజం కూడా అమ్మనివ్వమని భూములు కాపాడడానికి ఎలాంటి పోరాటాలకైనా వెనకాడమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్ కె ఎస్ వి కుమార్ సీపీఐ సీపీఎం నాయకులు ఎస్ కె రెహమాన్ కృష్ణారావు పి చంద్రశేఖర్ ఎం సుబ్బారావు ఎం మన్మదరావు కుమారి జి కాసులరెడ్డి అప్పారావు అప్పన్న రవి చిరంజీవి లక్ష్మణరావు  తదితరులతో పాటు వామపక్ష పార్టీలు నాయకులు యం. సుబ్బారావు, వై.రాజు, వి.నరేంద్ర కుమార్, బి.బి.గణేష్, కుమారి, యల్.జె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts