YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ 19 సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ గా ఉంది.

కోవిడ్ 19 సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ గా ఉంది.

* ప్రజలు అప్రమత్తం గా ఉండాలి  వ్యాక్సినేషన్ పట్ల అపోహలు వద్దు...   అందరూ వేయించుకోండి వేస్తున్నాం వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడండి * కమిషనర్ గిరీషా..
తిరుపతి
కోవిడ్ 19 సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ గా ఉందని, నగరంలోని ప్రజలందరూ తప్పక మాస్క్ ధరించి, శానిటైజర్ వినియోగిస్తూ, సామాజిక దూరం పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా నగరప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశం మందిరం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికి 1208 కేసులు ఉన్నాయన్నారు. వారంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో కోవిడ్ వాక్సినేషన్ చేపడుతున్నామన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు లక్షా ఇరవై వేల మంది ఉండగా 48,800 మంది కి వ్యాక్సిన్ వేసామన్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. అపోహలు వీడి అందరూ వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. 11 నుండి 14 వ తేదీ వరకుటీకా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. టీకా వారోత్సవాల లో 30 నుంచి 40 వేల వరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.  సచివాలయంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పి.హెచ్.సి.లో కూడా అందిబాటులో ఉందన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ట్రయాజిన్ టెస్టు చేసుకోవాలన్నారు. .అలసత్వం వహిస్తే ప్రాణాలకు ప్రమాదమన్నారు. పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్  తెలుసుకుని జాగ్రత్త పడాలన్నారు. పాజిటివ్ వచ్చి సింటమ్స్ లేకున్నా 7 నుంచి 15 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండే వారికి కిట్ లు ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఎదో జరుగుతుందని , అపోహాలకు పోకుండా, అందరూ వాక్సిన్ వేయించుకోవాలన్నారు. కర్ఫ్యూ విధించడం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంటుందన్నారు. 12 వేల డోసుల టీకా అందుబాటులో ఉందని, రోజుకు 2 వేల  నుండి 2,500 మందికి వాక్సినేషన్ చేస్తామన్నారు. వాలంటీర్లు ఇండ్ల వద్దకు వెళ్లి 45 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి వాక్సిన్ వెయిస్తున్నామన్నారు. చెన్నై, బెంగళూరు వంటి సిటీల్లో పనిచేసేవారు తిరిగి వస్తుండడం వలన కూడా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని, వారి ద్వారా వ్యాపించకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. వారిని హోమ్ క్వారంటేన్ చేస్తున్నామన్నారు

Related Posts