YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటు మనందరి హక్కు.. అందరూ ఓటు వేయండి

ఓటు మనందరి హక్కు.. అందరూ ఓటు వేయండి

తిరుపతి
ఓటు మనందరి హక్కు అని, ఉప ఎన్నికల్లో  ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కమిషనర్ గిరిష అన్నారు. మీ చుట్టూ పక్కల వారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రచారాల్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారని, అందరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. పోలింగ్ రోజు కూడా అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలన్నారు. పోటీలో ఉన్నవారూ, ప్రచారంలో పాల్గొనే వారు, ఓటు హక్కు వినియోగించుకునే వారు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కోవిడ్ నిభందనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కొంతమందికి ఫైన్ కూడా వేయడం జరిగిందన్నారు. ఓటర్ స్లిపుల పంపిణీ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో.పూర్తవుతుందన్నారు.
రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఎవ్వరు అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని,  వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.  చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు  ఎక్కువగా నీరు, మజ్జిగ , పండ్లు వంటివి తీసుకోవాలన్నారు. దోమలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తే మంచిదన్నారు. ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. తద్వారా డెంగ్యూ వంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు.  

Related Posts