YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అహంకారమునకు - మానవ జన్మకు సంబంధ, బాంధవ్యం ఏమిటి ?!

అహంకారమునకు - మానవ జన్మకు సంబంధ, బాంధవ్యం ఏమిటి ?!

*_మానవ జీవితంలో అహంకారం అనేది, తప్పక వెంబడిస్తుంది, ఎందుకనగా నిత్యం మనం ఎన్నో కార్యాలలో పాల్గొనడం, అందులో ఎన్నో ఆటంకాల రూపంలో కానీ, మారే ఇతర రూపంలో కానీ, మనల్ని ఇవీ వెంబడిస్తూనే ఉంటాయి..._*
*_ఇలాంటి సందర్భంలో మనమేమి చేయాలి నిత్య సాధనలో ఉండాలి, ఆ సాధన ఎలా వుండాలి మరి..._*
*_అంటే తన సాధనకి అడ్డురాని ఉద్యోగం, వ్యాపారం, భార్యాబిడ్డలు, స్నేహితులు, తన జీవన విధానం, దినచర్య తను వేసే ప్రతిఅడుగు గమ్యం వైపే సాగుతుంది. తాను దేని కోసం జీవితాన్ని గడుపుతున్నాడో దాని కోసం సర్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు..._*
*_అలా కాకుండా రోజూ సక్రమంగా సాధన చేయడానికి సమయం లేదనో, తాము జీవితంలో చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని పూర్తిచేసుకొని సాధన కొనసాగిస్తామని, జీవితం బాగా అనుభవించిన తర్వాత ఇక అనుభవింప యోగ్యంకాని, సాధనకి పనికిరాని, ముసలి వయసులో బాగా సాధన చేస్తామని అనేవాళ్ళకు అసలు సాధనంటే ఇంకా తెలియదని అర్ధం చేసుకోవాలి, ఇలాంటి వారి మాటలు అవహేళనగా వుంటాయి, ఇలాంటి వారి చాలా దూరం ఉండడం మంచిది..._*
*_మానవుడు ఉండేదే దేవుడవడం కోసం. విత్తు ఉండేదే చెట్టు అవడం కోసమైనట్లు._*
*_కాబట్టి సాధన అనేది జీవితంలో ఒక భాగమని తెలుసుకొని తీరాలి. ఇది తెలుసుకోకుండా, సాధించకుండా, ఈ లోపల సాధన ముక్తి అని మాట్లాడడం చిన్నపిల్లవాని మాటలవలె అర్థరహితం, అది సాధిస్తేనే సాధన మొదలైనట్లు._*
*_అహమే జన్మలకు మూలమన్నారు. అట్టి అహమునే ఎరుక అన్నారు. అహంపదార్థరహితమే జన్మరహితమన్నారు._*
*_అయితే అహం అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తుందో దాని అర్థాన్ని తెలుసుకుంటే చాలన్నారు. పరిపూర్ణమును తెలియపర్చి అట్టి అహమనే ఎరుకను పోగొట్టేవారే సద్గురువు..._*
*_శరీరం ఉన్నంతకాలం చొక్కాలు ఎలా తొడుక్కుంటామో అలాగే అహంకారం ఉన్నంతకాలం శరీరమనే దాన్ని తొడుక్కుంటూ ఉండాల్సిందే !_*
*_ఆ అహంకారాన్ని గురుపాదాలపట్టి పోగోట్టుకునుంటేచాలు !_*
*_కుమ్మరి మట్టితో కుండలు చేస్తుంటే ఒక కుండా విరిగిపోయింది మళ్ళీ దాన్ని కుండగా చేస్తాడు. ఎందుకంటే దాన్ని కాల్చలేదు కాబట్టి కాల్చితే మళ్ళీ అతుకదు._*
*_అలాగే జ్ఞానాగ్నిలో కాల్చబడిన శరీరాలు మళ్ళీ జన్మించవు, దానిలోని కర్మయనే పచ్చిదనం పోయేంతవరకు బాగా కాల్చాలి, అప్పుడే జన్మ సార్థకత అవుతుంది..!

Related Posts