YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సుప్రీంకోర్టులోక‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

సుప్రీంకోర్టులోక‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

న్యూఢిల్లీ ఏప్రిల్ 12
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఇక నుంచి కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వ‌హించాల‌ని న్యాయ‌మూర్తులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కోర్టురూమ్‌ల‌తోపాటు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆల‌స్యంగా విచార‌ణలు మొద‌లుపెట్ట‌నున్నాయి.ఇండియాలో క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతంగా ఉంది. గ‌త వారం రోజుల్లోనే కొత్త‌గా ప‌ది ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారమే ల‌క్ష‌న్న‌ర‌కు పైగా కేసులు రావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఇండియాలోనే నమోదవుతున్నాయి.

Related Posts