YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాజస్థాన్ రాయల్స్ అసోసియేట్ స్పాన్సర్లుగా శ్రీ బజ్ రంగ్ పవర్ & ఇస్పాత్ లిమిటెడ్

రాజస్థాన్ రాయల్స్ అసోసియేట్ స్పాన్సర్లుగా శ్రీ బజ్ రంగ్ పవర్ & ఇస్పాత్ లిమిటెడ్

హైదరాబాద్ ఏప్రిల్ 12
‘‘రాజస్థాన్ రాయల్స్ అనేది ఐపీఎల్ లో ఒక ఉద్వేగభరిత ఫ్రాంచైజ్. గోయెల్ టీఎంటీ తరహా అంకితభావం, ఆకాంక్ష, శక్తిని ప్రదర్శించే జట్టును స్పాన్సర్ చేయడం మాకెంతో ఆనందంగా ఉందని సందర్భంగా బజ్ రంగ్ పవర్ & ఇస్పాత్ లిమిటెడ్ డైరెక్టర్ సందీప్ గోయెల్పేర్కొన్నారు. ఆన్ ఫీల్డ్ అయినా, ఆఫ్ ఫీల్డ్ అయినా కూడా గోయెల్ టీఎంటీ & గోయెల్ పైప్స్ లో మేం శక్తిని అందించేందుకే కట్టుబడి ఉన్నామన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టుకు అసోసియేట్ స్పాన్సర్ గా వ్యవహరించడం మాకెంతో గర్వకారణం. ట్రోఫీని ఇంటికి తీసుకురావడంలో జ ట్టు  చేసే ప్రయాణంలో అది విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో అనుబంధం కలిగిన ఈ బ్రాండ్ రాజస్థాన్ రాయల్స్ తో ప్రస్తుత స్పాన్సర్ షిప్ ఒప్పం దంతో మరోసారి క్రికెట్ ప్రపంచంలోకి వచ్చినట్లయింది. ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉనికిని చాటుకునేందుకు ఈ సంస్ధ ఒక ఆదర్శ జట్టును ఎంచుకున్నట్లయింది. ఈ సందర్భంగా గోయెల్ మాట్లాడుతూ, ‘‘దేశంలో అత్యధికులు చూసేది క్రికెట్ అనడంలో సందేహం లేదు. కోట్లా దిమంది యువ తతో, ఆటలను ఇష్టపడేవారితో అనుసంధానమయ్యేందుకు ఇదో చక్కటి వేదికను కల్పిస్తుంది. ఈ ఒప్పందంతో మేము కొత్త పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధపడినట్లయింది’’ అని అన్నారు.రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ జాక్ లష్ మెక్ క్రమ్ మాట్లాడుతూ, ‘‘బజ్ రంగ్ పవర్ & ఇ స్పాత్ లిమిటెడ్ ను ఈ ప్రయాణంలోకి ఆహ్వానించేందుకు మేం సంతోషిస్తున్నాం. తమ బ్రాండ్లు గోయెల్ టీఎంటీ & గోయెల్ పైప్స్ ద్వారా  ప్రస్తుత సీజన్ కు రాజస్థాన్ రాయల్స్  అసోసియేట్ స్పాన్సర్ గా ఉంటోంది. వినూత్నత నాణ్యత అనేవి ఆ బ్రాండ్ల విశిష్టతలుగా ఉన్నాయి. వాటితో మా అనుబంధం ఎంతో పటిష్ఠంగా ఉంటుంది. ఈ రెండు సంస్థల మద్య అనుబంధాన్ని మరింత పెంచేలా ఉభయులకూ లాభదాయకమైన భాగస్వామ్యం కోసం మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.ఐపీఎల్ 2021 క్రికెటింగ్ సీజన్ మొత్తం కూడా బ్రాండింగ్ హక్కులు, ప్రమోషనల్ కార్యకలాపాలతో గోయెల్ టీఎంటీ & గోయెల్ పైప్స్  రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అసోసియేట్ స్పాన్సర్ గా ఉండనుంది.

Related Posts