YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏ మతగ్రంథంలోనూ జోక్యం చేసు కోం: సుప్రీంకోర్టు

ఏ మతగ్రంథంలోనూ జోక్యం చేసు కోం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ ఏప్రిల్ 12
ఏ మతగ్రంథంలోనూ జోక్యం చేసుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఖురాన్ షరీఫ్ నుంచి 26 శ్లోకాలను తొలగించాలని లక్నోకు చెందిన వసీం రిజ్వి దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, పిటిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించింది.ఖురాన్‌లోని 26 శ్లోకాలను తొలగించాలని ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ శ్లోకాలను బోధించడం ద్వారా చాలా మంది విద్యార్థులు తప్పుదారి పట్టించారని, అందుకే ఖురాన్‌లోని శ్లోకాల‌ను తొల‌గించాల‌ని పిటిషన‌ర్ వాదించాడు. పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏ మ‌త గ్రంథంలోనూ జోక్యం చేసుకోమ‌ని స్ప‌ష్టం చేసింది. దీనితో పాటు అత‌డికి కోర్టు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వ‌సీం రిజ్వి పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా, పిటిషనర్ తరపు న్యాయవాది ఈ ఎస్‌ఎల్‌పీకి సంబంధించిన అన్ని వాస్తవాలు త‌న‌కు తెలుసున‌ని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు ఈ ఎస్‌ఎల్‌పీ రిట్ కాదని పేర్కొన్న‌ది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఈ శ్లోకాలను మదర్సాల్లో బోధిస్తూ విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నార‌ని తెలిపారు. ఈ శ్లోకాలను బోధించడం, వివరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులు తయారవుతున్నార‌ని విచారం వ్య‌క్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇది నిరాధారమైన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషన్‌దారుకు రూ.50 వేల జరిమానా విధిస్తూ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

Related Posts