YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోర్టుకు రైతులు...కేసీఆర్ కు షాక్

కోర్టుకు రైతులు...కేసీఆర్ కు షాక్

హైదరాబాద్, ఏప్రిల్ 12, 
ఈనెల 14న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభపై స్థానిక రైతులు హైకోర్టు ఎక్కారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారు అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతులు. కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని చెబుతున్నారు. కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దు అంటూ ప్రభుత్వం లక్ష మందితో సభ ఎలా పెడుతారని రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు సీఎం సభపై కోర్టుకు ఎక్కడంపై ఇప్పుడు కేసీఆర్ సభపై నీలి నీడలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ సభను రద్దుచేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Related Posts