YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి ఈ-చలాన్ ద్వారా జరిమానాలు

మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి ఈ-చలాన్ ద్వారా జరిమానాలు

పెద్దపల్లి
దేశంలో కరోనా వైరస్ 2వ దశలో వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఉన్నతాధికారుల సూచనల మేరకు గోదావరిఖని పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార కేంద్రాల వద్ద సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కమలాకర్ మాస్క్ లు ధరించకుండా, కోవిడ్19 నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురికి ఈ-చలాన్ విధానం ద్వారా అంటు వ్యాధుల నిరోధక చట్టం ప్రకారం జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ 2వ దశలో వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కోవిడ్19 నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారని అటువంటి వారిపై ఈ-చలాన్ విధానం ద్వారా అంటు వ్యాధుల నిరోధక చట్టం ప్రకారం జరిమానాలు విధించడమే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఇతర వస్తువుల్ని కానీ మనుషుల ని కానీ తాకినప్పుడు చేతులకు సానిటైజర్ రాసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలకు, సభలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మాస్క్ లు లేకుండా కార్లలో, బైక్ లపై వస్తున్న వారికి వాహనాల ఆపి తనిఖీచేయు సందర్భంలో, కెమెరా ద్వారా ఫోటోలు తీసి కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ పద్ధతుల్లో వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు. వ్యాక్షిన్ వేసుకోవడం లో ఎలాంటి అపోహలు లేకుండా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్షిన్ వేయించుకోవాలని తెలిపారు. మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై ఈ-చలాన్ విధానం ద్వారా అంటు వ్యాధుల నిరోధక చట్టం ప్రకారం రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు.

Related Posts