YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోవిడ్ నియమాలను పాటిస్తూ రంజాన్ మాసం ను నిర్వహించు కోవాలి

కోవిడ్ నియమాలను పాటిస్తూ రంజాన్ మాసం ను నిర్వహించు కోవాలి

ప్రార్థన మందిరంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడాలి ముస్లిం మత పెద్దలతో  సమావేశంలో జిల్లా ఎస్పీ  సింధు శర్మ
జగిత్యాల ఏప్రిల్ 13
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నియమాలను పాటిస్తూ రంజాన్ మాసం ను నిర్వహించు కోవాలని జిల్లా ఎస్పీ సీంధు శర్మ సూచించారు.సోమవారం రాబోవు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో  ముస్లిం మత పెద్దలతో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రాబోవు పవిత్ర రంజాన్ మాసాన్ని కోవిడ్ నియమాలు మరియు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు.ముఖ్యంగా ప్రార్ధన మందిరంలో ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయిని ఈ కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమాలు తప్పకుండా పాటించాలని, పండగలు అనేది కరోనా  కేసులు పెరగడానికి ఒక కారణంగా ఉండకూడదన్నారు. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే వారిని ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ మాస్క్లను ధరిస్తూ పోలీసు వారి సూచనలను, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను పోలీసు వారి సూచనలు పాటిస్తూ రంజాన్ మాసాన్ని నిర్వహించు కుంటామని జిల్లా ఎస్పీకి తెలిపారు.  ఈసమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, ఎస్బీ  ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి,ఎస్.ఐ లు శంకర్ నాయక్, చిరంజీవి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Related Posts