నెల్లూరు
తెలుగు సాంప్రదాయాలు తెలుగు వైభవానికి ఉగాది ప్రతీక అని అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు .సోమవారం స్థానిక ఇరుగాళమ్మ దేవాలయంలో మహిళలకు వాయినాలు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సాంప్రదాయం ప్రకారం మన నూతన సంవత్సరం ఉగాది తీపి ,పులుపు ,వగరు ఉగాది పచ్చడి చిహ్నమని ,అలాగే మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సుఖాలతో ఉంటాయని ఆమె అన్నారు .కష్టాలు సుఖాల్లోనూ వచ్చాయని బాధపడకుండా సంతోషం పడకుండా తెలియజెప్పేదే నూతన సంవత్సరాది ఉగాది అని ఆమె పేర్కొన్నారు .ఉగాది ఉత్సవాలతో పాటు నూతన పంచాంగం నూతన క్యాలెండర్లను రూపొందించడం ఆనవాయితీ అని ఆమె అన్నారు .ఈ ఇంగ్లీష్ సంవత్సరాముతోపాటు తెలుగు సంవత్సరాది కూడా నేటితరం చేయవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు .ఈ సందర్భంగా మహిళలను సత్కరించి వాయనాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి ప్రసాద్ .సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు