YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆ ప్రకటన ఏమైంది ప్రదానిని నిలదీసిన నిలదీసిన రాహుల్

ఆ ప్రకటన ఏమైంది ప్రదానిని నిలదీసిన నిలదీసిన రాహుల్

న్యూఢిల్లీ ఏప్రిల్ 13
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈవెంట్స్ నిర్వహించడం మానేసి, అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ రాహుల్ చురకలంటించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోందని, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు రాహుల్  ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకునే పేద ప్రజలకు కేంద్రం సాయం చేయాలని మోదీని కోరారు. 18 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామని మోదీ కొన్ని రోజుల క్రితం ప్రకటన చేశారని, ఆ ప్రకటన ఏమైందని రాహుల్ నిలదీశారు. ‘‘గంటలు మోగించారు. ప్లేట్లు మోగించారు. ఫోన్ టార్చ్‌లను వెలిగించారు. అయినా కరోనా వేవ్ సాగుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతోంది. లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈవెంట్స్‌పై దృష్టి మానేసి, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించండి. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతలను ఆపేయండి. పేదలకు వీలైనంత సహాయం అందించండి’’ అని రాహుల్ గాంధీ సూచించారు

Related Posts