YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిటాల బలపడుతున్నారా...

పరిటాల బలపడుతున్నారా...

అనంతపురం, ఏప్రిల్ 14, 
తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతటా ఇబ్బంది పడుతుంది. నాయకత్వం లేక అనేక చోట్ల క్యాడర్ చెల్లాచెదురయింది. అయితే రాప్తాడు, ధర్మవరంలో మాత్రమ పరిటాల కుటుంబం యాక్టివ్ కావడం పార్టీకి కలసి వచ్చే అంశమే. తాడిపత్రిలో గెలుపుతో పరిటాల కుటుంబం కూడా దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది. చేతులు ముడుచుకుని కూర్చుంటే దశాబ్దాలుగా ఉన్న తమ కుటుంబం చరిత్రకే మచ్చ వస్తుందని భావిస్తున్నారు. అందుకే పరిటాల శ్రీరాం యాక్టివ్ అయ్యారు.పరిటాల శ్రీరాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొన్నటి ఎన్నికల్లోనే దిగారు. రాప్తాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి నుంచి బయటపడటానికి పరిటాల శ్రీరాంకు చాలా రోజుల సమయమే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలసి రాలేదు. పైగా తమపైనే కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక తెగించి పోరాడటమే మేలని పరిటాల శ్రీరాం భావిస్తున్నారు. ఇందుకు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదాహరణగా నిలిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసులు వరసగా బనాయించడం వల్లనే ఆయనపై తాడిపత్రిలో సింపతీ ఏర్పడింది. ఆ కారణంగానే తాడిపత్రి మున్సిపాలిటీ దక్కింది. క్యాడర్ ను కూడా జేసీ సోదరులు పట్టించుకోవడంతోనే అది సాధ్యమయింది. దీంతో తనపై ఎన్ని కేసులు నమోదయితే అంత మంచిదని పరిటాల శ్రీరాం భావిస్తున్నారు. కేసుల వల్ల తనకు సింపతీ పెరుగుతుందే తప్ప, నష్టమేమీ జరగదని ఆయన భావించి మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరాం ఇటీవల ఎక్కువగా పర్యటిస్తున్నారు. తనపై వరసగా ఆరు కేసులు నమోదవ్వడంతో తొలుత ఆందోళన చెందినా ఆతర్వాత సర్దుకుని క్యాడర్ తో మమేకం అవుతున్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించుకున్నారు. మొత్తం మీద జేసీ తరహాలో తనపై కేసులు నమోదయ్యే కొద్దీ సానుభూతి పెరుగుతుందన్నది పరిటాల శ్రీరాం అంచనా. నిజమేనేమో. జేసీ గెలిచాడుగా.

Related Posts