YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

17 తర్వాత పార్టీ లేదు..తొక్కా లేదు

17 తర్వాత పార్టీ లేదు..తొక్కా లేదు

టీడీపీ గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన  వ్యాఖ్యలు లోకేష్‌పైనా తీవ్ర అసహనం,విమర్శలు
అమరావతి ఏప్రిల్ 14 : ‘పార్టీ లేదు... బొ.. లేదు..! అంతా అయిపోయింది...! ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కాబట్టి పట్టుబట్టి ఉంటున్నాం...!’ టీడీపీ గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివీ. లోకేష్‌ పైనా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ మనిషే సరిగా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని నిర్వేదం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావుతో అచ్చెన్నాయుడు ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్‌లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బహిర్గతమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడే పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు టీడీపీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయింది.
చంద్రబాబు పార్టీ నడిపిస్తున్న తీరును సీనియర్‌ నాయకులే తప్పు బడుతున్నారు. ఆయనపై నమ్మకం కోల్పోయి, పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించి ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీని వీడారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలిన వారు సైతం పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. 80 శాతం మంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు స్తబ్దుగా ఉంటూ కార్యకలాపాలే నిర్వహించడంలేదు. చంద్రబాబు ఏదైనా పిలుపు ఇస్తే సోషల్‌ మీడియా, అనుకూల మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో పట్టించుకునే దిక్కులేదు. పార్టీ క్యాడర్‌ మొత్తం నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ ముందుగానే చేతులెత్తేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని మెజారిటీ పంచాయతీల్లో సైతం దారుణంగా ఓటమి పాలైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో అయితే పూర్తిగా జీరో అయిపోయింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక్క మున్సిపాల్టీలో అతికష్టం మీద గట్టెక్కిందంటే టీడీపీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు.  తిరుపతి ఉప ఎన్నికలోనూ గెలుస్తామనే ఆశ ఏ టీడీపీ నాయకుడిలోనూ కనిపించడంలేదు. స్వయంగా అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ తర్వాత ఇక ఏమీ ఉండదని, పార్టీ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి టీడీపీకి భవిష్యత్తు లేదని స్పష్టమవుతోంది. తన కుటుంబం మొత్తాన్ని సూసైడ్‌ చేసుకోవాలని లోకేష్‌ అన్నాడని టీడీపీ నేత ఆకుల వెంకట్‌ అచ్చెన్నతో వాపోవడం కలకలం రేపుతోంది.
లోకేష్‌ వ్యవహార శైలిపై టీడీపీలో ఎంత అసంతృప్తి, ఆగ్రహం ఉందో తాజాగా అచ్చెన్నాయుడు, వెంకట్‌ మాట్లాడుకుంటున్న వీడియో సంభాషణ ద్వారా బయటపడింది. తనను ఎత్తుకుని తిప్పిన వ్యక్తిని ‘ఏమ్మా..?’ అని పిలిచాడంటే లోకేష్‌కు ఎంత గర్వమో అర్థం చేసుకోవచ్చని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.  అచ్చెన్నాయుడు, యనమల లాంటి నాయకులను లోకేష్‌ అవమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్‌ సరిగా ఉంటే పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందని అచ్చెన్న అసహనం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. సీనియర్‌ నాయకులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అంతా తాను చెప్పినట్లే చేయాలని, అందరూ తన కనుసన్నల్లో ఉండాలంటూ దర్పం ప్రదర్శిస్తుండడాన్ని పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తనయుడి వ్యవహార శైలి గురించి తెలిసినా పార్టీ వ్యవహారాలను చంద్రబాబు ఆయనకే అప్పగించడం, భవిష్యత్తు నాయకుడు ఆయనేనని  చెబుతుండడంతో పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే అసమర్థుడిగా, జనంలో పప్పుగా ముద్రపడిన వ్యక్తి చేతుల్లో పార్టీని పెడితే పరిస్థితి ఏమిటనే చర్చ అన్ని స్థాయిల్లోనూ తరచూ జరుగుతోంది.

Related Posts