YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్ మీదే... కొత్తూరు కు మంత్రి కేటిఅర్ వారాల జల్లు

రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్ మీదే...   కొత్తూరు కు మంత్రి కేటిఅర్ వారాల జల్లు

షాద్ నగర్ ఏప్రిల్ 14
రాబోయే రోజుల్లో షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని, ఎంతో మెరుగైన పాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో గొప్ప ప్రగతిని సాధించబోతున్నాట్టు తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.త్వరలో రీజినల్ రింగ్ రోడ్ రాబోతుందని ఇక్కడి ప్రాంతం అవుటర్ రింగ్ రోడ్డు రూరల్ రింగ్ రోడ్డు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య కొత్తూరు ఎంతో ప్రగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్, మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో కొత్తూరు మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంతో పాటు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత కూరగాయల మార్కెట్ యార్డ్ అదేవిధంగా మరో రెండు కోట్ల రూపాయలతో కొత్తూరులో మెరుగైన వీధిదీపాల ఏర్పాటుకు హామీ ఇస్తూ బహిరంగ సభలో ప్రజలకు కేటిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించగా ఎంతో అభివృద్ధిని సాధించామని కేటీఆర్ వివరించారు. నాడు కాంగ్రెస్ పాలనలో కనీసం తాగునీటికి కూడా నోచుకోలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 200 రూపాయల నుండి 2000 రూపాయల వరకు 10 రేట్లు  పింఛన్ పెంచిన ఘనత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. పేదల ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదవాళ్లు చదువుకునే సర్కారు బడిలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 50 వేల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని, అదేవిధంగా ఒక్కో విద్యార్థిపై ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య కోసం 12 వేల 800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించామని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పూలే పేరిట విదేశీ విద్య కోసం ఒక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్, గృహాలకు, పరిశ్రమలకు 24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని కొనియాడారు. అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి రైతు బంధు, రైతు కుటుంబం రక్షణకు రైతు బీమా పథకాలతో రైతులను ఆదుకున్నట్లు పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం వసతి లభిస్తుందని అన్నారు. మా తండాలో మా రాజ్యం అనే విధంగా లంబాడీల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప చేస్తూ 3400 తండాలను పంచాయతీలుగా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త జిల్లాలతో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని అన్నారు. తెలంగాణలో పేద ప్రజల బిడ్డలు లగ్గం చేసుకుంటే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆదుకుంటున్నటు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంజయ్య కోరిక మేరకే కొత్తూరు మండలాన్ని మున్సిపాలిటీగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. త్వరలో కొత్తూరు మున్సిపాలిటీకి ఎన్నికలు రాబోతున్నాయని మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అంజన్నకు అండగా నిలబడితే ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. మండలంలో బ్రహ్మాండమైన పరిశ్రమలు రాబోతున్నాయని ప్రకటించారు. పనిచేసే ప్రభుత్వానికి పనిచేసే నాయకుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వివాద రహితుడు అందరికీ ఆత్మీయుడు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కుల మత రాజకీయాలు టిఆర్ఎస్ పార్టీ చేయదని, అన్ని వర్గాలు తమకు సమానమేనని హిందీలో ప్రసంగించారు  ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంల ఈ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వరి, ఏసీపీ కుషాల్కర్, స్థానిక సీఐ శ్రీధర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts