YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*కోవిడ్ రెండవ రూపము- జాగ్రత్తలు*

*కోవిడ్ రెండవ రూపము- జాగ్రత్తలు*

గత  సెప్టెంబర్ 20 లో భారతదేశంలో 98000 కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. తరువాత తగ్గటం మొదలయ్యింది.. మరల కోవిడ్ రెండో దశలో  ప్రస్తుతం ఏప్రిల్ 2021 లో లక్షా ఎనభై వేల వరకు కేసులు నమోదు అవ్వడమే కాకుండా  ఈ కరోనా వైరస్ స్మార్ట్ గా ప్రజల్ని మరింత ఇబ్బంది పెడుతున్నది. 8 వేల కేసులు నుండి 98 వేల కేసుల వరకు రావటానికి మొదటి దశలో కరోనా కి రమారమి వంద రోజులు పట్టింది. ప్రస్తుతం ఉన్న రెండవ దశలో ఎనిమిది వేల నుంచి లక్షా 80 వేల కేసులకు *50 రోజుల్లో* చేరుకోవడం జరిగింది అనగా ఈ కరోనా వైరస్ ఎంత త్వరితగతిన వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది ప్రజలను అతి వేగంగా అటాక్ చేస్తూ ఉంది సెప్టెంబర్ 2020  లో భారతదేశంలో లో *1290* (16.9.20)మంది అత్యధికంగా చనిపోవటం నమోదయింది. 
కానీ రెండవ దశలో ఏప్రిల్లో రమారమి వెయ్యి మంది దాకా చనిపోవటం నమోదు అయ్యింది. మనము రెండవ దశలో మొదట్లోనే ఉన్నాము. రాబోయే కాలంలో అత్యధిక మరణాల సంఖ్య చూడ వలసి వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. 
మొదటి దశలో 50 సంవత్సరాల పైబడిన వారు ఎక్కువ దీని బారిన పడ్డారు దీనికి తగ్గట్టుగా అనేక జాగ్రత్తలు సూచనలు తీసుకోవటం జరిగినది. కానీ ఆశ్చర్యంగా రెండవ దశలో 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఈ కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారు. అంతేకాకుండా  యువత ఆజాగ్రత్తగా ఉండటం వలన  వీధి లో ఉన్నటువంటి కోరానాని కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందే విధంగా పరోక్షంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో  ఢిల్లీలో ఛత్తీస్గఢ్ లో  యువత అత్యధికంగా కరోనా కి బలి అవుతున్నారు. భారతదేశం లో 50 %  పైగా 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి యువత ఉన్నారు. ఈ కరోనా రెండవ దశలో ప్రస్తుతం వీరిని ఎటాక్ చేస్తూ ఉంది దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. యువతను సంరక్షించుకోవటం అత్యంత అవసరం. గమనించాల్సిన విషయం ఏమంటే మొదటి దశలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల లో నే మళ్ళీ రెండవ దశలో వైరస్ ప్రబలుతోంది. ఈ  రాష్ట్రాలలో మాక్సిమం యాంటీబాడీస్ ఉండాల్సి ఉంటుంది కానీ మళ్లీ అదే రాష్ట్రంలో అదే ప్రజలకు ఈ వైరస్ మరింత ఉదృతంగా ఎటాక్ చేస్తుంది . అంటే  ఈ వైరస్ చాలా  స్మార్ట్గా బిహేవ్ చేస్తూ మనిషికి,  కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ మరింత వ్యాప్తి  చెందుతూ  ఉందని గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ ప్రజలు వైరస్ స్మార్ట్ బిహేవియర్ కి  అనుగుణంగా స్మార్ట్ గా వ్యవహరించక పోవడంతో  , నాకు రాదు అన్న నిర్లక్ష ధోరణి పెంచుకోవడం వలన వైరస్ వ్యాప్తి రోజురోజుకి మరింత పెరుగుతోంది. ప్రభుత్వం వారు ఎన్నిసార్లు చెప్పినా మాస్కులు ధరించడం నామోషీగా భావిస్తూ మాస్క్ లేకుండా,  భౌతిక దూరం పాటించకుండా  ఉండటం అనవసరంగా ప్రయాణం చేయటం  పార్టీలకు వెళ్లడం , సినిమా హాలు రెస్టారెంట్లలో ,  సమావేశాలలో సరైనటువంటి జాగ్రత్తలు ఇంకా చాలామంది తీసుకోక పోకపోవడంతో ఈ వైరస్ అత్యధిక వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కొరోనా వచ్చి తగ్గిన తరువాత కూడా రెండోసారి  కరోనా అటాక్ అయ్యే వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వ వలసిన పరిస్థితి రెండవ దశలో ఏర్పడబోతోంది. ఇదే కాకుండా  hotspot ఏరియాలు , ఎక్కువ ఎఫెక్ట్ అయినా ప్రాంతాలకు జిల్లాలకు ముందుగా వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా దీని వ్యాప్తి ఇతర ప్రాంతాలకు చెందకుండా చూడవచ్చు వ్యాక్సినేషన్ వేయించుకోవటం అత్యవసరము. కోవిడ్ తో మరింత కాలం సహచర్యం చేయవలసి ఉంటుంది. తదనుగుణంగా మన జాగ్రత్తలో మనం  ఉంటూ మన కుటుంబాన్ని కాపాడుకోవటం మన సామాజిక బాధ్యతగా  గుర్తించవలసి ఉంటుంది ఇంటర్ స్టేట్,  ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రయాణాలు  ఫ్రీ గా ఉండటం వలన తగు జాగ్రత్త వహించడం లేదు. రాబోయే కాలంలో ప్రయాణాలను పరిమితం చేయాల్సి ఉండవలసి వస్తుంది. మనకి మనమే *స్వీయ నియంత్రణ* చేసుకోవాల్సి న పరిస్థితి ఉంటుంది ఎవరి జాగ్రత్తలో వాళ్లు లేకుంటే కరోనా మరింత ఉదృతంగా మారే అవకాశాలు ఉన్నాయి. *తస్మాత్ జాగ్రత్త* అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.,
Courtesy:డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా
ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్

Related Posts