YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కాంగ్రెస్ లో షర్మిల టెన్షన్

 కాంగ్రెస్ లో షర్మిల టెన్షన్

 కాంగ్రెస్ లో షర్మిల టెన్షన్
హైదరాబాద్, ఏప్రిల్  15,
 వైఎస్ షర్మిల పార్టీ వైపు పేరున్న నేతలు ఎవరూ వెళ్లకుండా చూడాలని ఇప్పటికే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. షర్మిలను రాజకీయంగా తొలినాళ్లలోనే కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది.వైఎస్ షర్మిల పార్టీ పెడుతుండటంతో కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్, తెలంగాణలో సోదరి షర్మిల పార్టీని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దీంతో కాంగ్రెస్ ముందస్తు చర్యలను ప్రారంభించిందంటున్నారు. కాంగ్రెస్ కు ప్రధాన ఓటు బ్యాంకు రెడ్డి సామాజికవర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు. వీటిని ఏపీలో జగన్ తన పార్టీకి తీసుకెళ్లిపోయారు.తెలంగాణకు వచ్చే సరికి మైనారిటీలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు ఒకింత కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పాలి. వీరితో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్ వైపే ఇప్పటి వరకూ ఉంది. బలమైన బీసీ ఓటు బ్యాంకు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉండటంతో రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఎస్సీ, ఎస్టీ ఓట్లతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓట్లకు గండిపడే ప్రమాదముందన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తమవుతుంది.దీంతో రెడ్డి సామాజకవర్గం వారిచేతనే తొలుత కౌంటర్ ఇప్పించాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. మరోసారి కేసీఆర్ కు మేలు చేసేందుకే వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టారన్న ప్రచారాన్ని ఇప్పటికే కాంగ్రెస్ కిందిస్థాయిలోకి తీసుకెళ్లింది. బలమైన రెడ్డి సామాజికవర్గం నేతలు ఎవరూ వైఎస్ షర్మిల పార్టీ వైపు వెళ్లకుండా ముందుగా వారితో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ పై భరోసా కల్పించాలని కాంగ్రెస్ భావిస్తుంది.ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి నేతలకు షర్మిలకు వ్యతిరేకంగా గళం విప్పేలా చేయాలన్న యోచనలో ఉంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు సయితం కోల్పోకుండా కాంగ్రెస్ దళిత నేతలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వైఎస్ షర్మిల పార్టీ వైపు పేరున్న నేతలు ఎవరూ వెళ్లకుండా చూడాలని ఇప్పటికే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. షర్మిలను రాజకీయంగా తొలినాళ్లలోనే కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది.
బీజేపీలో కనిపించని టెన్షన్
తెలంగాణలో వైయస్ షర్మిల విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పుడు జాగ్రత్తపడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఎవరైనా వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే దానిపై ఆసక్తి కరంగా చూస్తున్నారు. కొంతమంది ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు.కొన్ని కొన్ని అంశాల్లో వైయస్ షర్మిల బీజేపీని కూడా గట్టిగానే టార్గెట్ చేయవచ్చు. బిజెపిలో దళిత సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే అంశాన్ని ఆమె ప్రస్తావించే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి దళితులకు అన్యాయం చేస్తుందని కొన్ని పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నాయి. కాబట్టి షర్మిల కూడా తెలంగాణలో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని బీజేపీ నేతలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. బిజెపి అగ్ర నాయకత్వం కూడా షర్మిల విషయంలో జాగ్రత్తగా ఉండి పార్టీలో నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. బిజెపి లో చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని షర్మిల తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉండవచ్చు అని సమాచారం.

Related Posts