YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 అడ్డూ, అదుపు లేని ఇసుక అక్రమ రవాణా

 అడ్డూ, అదుపు లేని ఇసుక అక్రమ రవాణా

 అడ్డూ, అదుపు లేని ఇసుక అక్రమ రవాణా
మహబూబ్ నగర్, ఏప్రిల్ 16, 
పాలమూరు జిల్లాల్లోని తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి , రేణుకుంట , నేదునూర్ ,గొల్లపల్లి , నుస్తులాపూర్ గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు ,రాత్రి తేడాలేకుండా కొత్తపల్లి మోయతుమ్మెద వాగు నుండి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.  ఇసుక ను పరిమితికి మించి ఎక్కువ లోతుకు తీయడంతో భూగర్బ జలాలు అడుగంటుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అయినప్పటికి బావి ఉన్న రైతులకు మాత్రం నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.వ్యాపారులు ఒక్కో ఇసుక ట్రిప్పుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం ఊపందుకోవడంతో ఇసుకకు భలే డిమాండ్ ఉంది. లింగాపూర్, వెల్ది గ్రామాల నుంచి ఎక్కువగా ఇసుక రవాణా సాగుతోంది. బోరు ఉన్న రైతులకు మాత్రం 24 గంటల కరెంట్ బాగా ఉందని రైతులు తమ అబిప్రాయానిన వ్యక్తం చేస్తున్నారు. వాగు సమీపంలోని రైతులు ఆశ పడి వేసిన వరి నాట్లు 40 రోజులు కాగా నే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బావులు అడుగంటి బీటలు వాలుతున్న పరిస్థితి నెలకొంది. మానేరు సమీపంలో ఉన్న బావు ల్లో వర్షా కాలం బాగానే నీరు ఉన్నా , ప్రస్తుతం వాగు లోని ఇసుకను తోడటంతో నీరు నిల్వ లేకుండా పోయి భూ గర్బ జలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని అప్పు తెచ్చి పెట్టామని రైతులు కంట నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పోలీస్ , మైనింగ్ అధికారులు స్పందించి మోయతుమ్మెద వాగు నుండి ఇసుక అక్రమ రవాణా ఆపి , వరి పంటలు కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.సంబంధిత అధికారులు మాత్రం ఇసుక మాఫియా నుండి ముడుపులు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహిరిస్తున్నారని స్థానికుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . పట్ట పగలే నుస్తులాపూర్ నుండి పర్లపల్లి ,పోలంపల్లి వైపు రోజుకు వందల సంఖ్య లో ట్రాక్టర్ల తో ఇసుకను తరలిస్తున్నారు. అప్పుడప్పుడు రెవెన్యూ అధికారుల ముందు నుండే ట్రాక్టర్లు వెలుతున్నా తనకేం అవసరం లేనట్టు వ్యవహరిస్తున్నారని వారి తీరు పై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నుస్తులాపూర్ నుండి మొగిళిపాలెం వైపు వెలుతున్న ట్రాక్టర్ల వేగానికి అదుపు లేకుండా పోతున్నాయి . దీంతో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు ఇసుక వ్యాపారులు వాగులో ఇసుకను జెసిబిల సహాయంతో తోడి ట్రాక్టర్‌లలో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని మానేరు వాగు పరివాహక గ్రామాలైన శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, వేగురుపల్లి, ఊటూర్ గ్రామాల నుంచి నిత్యం ఇసుక తరలిపోతోంది. ఇసుక వ్యాపారులకు ఇసుక అక్రమ రవాణా కాసులు కురిపిస్తోంది.లింగాపూర్, వెల్ది గ్రామాలతో పాటు మానేరు వాగుకు వెళ్లే దారులు ఉన్న చోట భారీ కందకాలు తీసినట్లయితే వాగులోకి ట్రాక్టర్‌లు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. గతంలో మానేరు వాగుకు వెళ్లే దారుల్లో అధికారులు దగ్గరుండి యంత్రాల సహాయంతో కందకాలు తీయించడంతో ఇసుక రవాణా కొన్నాళ్లపాటు నిలిచిపోయింది.

Related Posts