YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

వ్యాక్సిన్‌ వేసుకుంటే భారీ నజరానాలు

వ్యాక్సిన్‌ వేసుకుంటే భారీ నజరానాలు

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 15 బంగారు ముక్కుపుడకలు, అద్దె చెల్లింపులు.. జీతంతో బోనస్‌, ఉచిత మద్యం  భారత్‌తో పాటు ఆఫర్లు ప్రకటించిన పలు దేశాలు
ప్రపంచ దేశాల్ని కరోనా అతలాకుతలం చేస్తున్నది. మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. టీకా వేసుకోవడంలో అలసత్వం, కొవిడ్‌-19 నిబంధనలను పాటించకపోవడంతో వైరస్‌ మళ్లీ జూలు విదిలిస్తున్నది. విశ్వమారిని నియంత్రించాలంటే వ్యాక్సినేషనే సులభమైన మార్గమని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. ప్రజలందరూ టీకా లు వేసుకోవడానికి పలు దేశాలు నజరానాలు ప్రకటిస్తున్నాయి.జనవరి 16న దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రజల సరాసరి.. దేశ జనాభాతో పోలిస్తే తక్కువస్థాయిలోనే ఉన్నది. తమ పట్టణంలో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నదని గ్రహించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జ్యువెల్లరీ వర్తక సంఘం ప్రతినిధులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాను వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఆడపడుచులకు బంగారు ముక్కుపుడకను, పురుషులకు హ్యాండ్‌ బ్లెండర్‌ను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీంతో అక్కడి వ్యాక్సిన్‌ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. టీకా వేసుకున్నవారికి 5% ట్యాక్స్‌ రిబేట్‌ను అదనంగా ఇస్తామని నార్త్‌ ఢిల్లీ మునిసిపాలిటీ ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా టీకా వేసుకున్న ఖాతాదారులకు ఎక్కువ వడ్డీరేటు (అదనంగా 25 బేసిక్‌ పాయింట్లను కలుపుతూ మొత్తం 5.35 శాతం వడ్డీ)ను చెల్లించనున్నట్టు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఐస్‌క్రీమ్‌, బీర్లు ఇవ్వడంతోపాటు ఇంటి అద్దెను కూడా చెల్లిస్తామని అమెరికాలోని కాలిపోర్నియా, లాస్‌వెగాస్‌, షికాగో తదితర రాష్ర్టాల్లోని స్థానిక యంత్రాంగం ఇప్పటికే ప్రకటనలను గుప్పించింది. టీకా వేసుకున్న ఉద్యోగులకు రూ.20 వేల బోనస్‌ చెల్లిస్తామని పలు అమెరికన్‌ సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు ధ్రువపత్రాన్ని చూపిస్తే క్యాష్‌ ప్రైజ్‌లు, రుసుము తీసుకోకుండా పార్కులు, మ్యూజియంలలోనికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు తమ దుకాణాల్లో వస్తువులను కొంటే డిస్కౌంట్లు ఇస్తామని చైనాలోని పలు షాపింగ్‌ మాల్స్‌ వెల్లడించాయి. టీకాలు వేసుకున్నవారికి రెండు ట్రేల గుడ్లను ఇస్తామని బీజింగ్‌ నగర అధికారులు ఆఫర్‌ ప్రకటించారు. టీకా వేసుకొంటే మద్యం సరఫరా చేస్తామని ఇజ్రాయెల్‌లో రెస్టారెంట్లు ప్రకటించాయి.వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి హాంకాంగ్‌ విభిన్న శైలి అవలంబిస్తున్నది. టీకాను వేసుకుంటే కరోనా ఆంక్షల కారణంగా కోల్పోయిన స్వేచ్ఛను ప్రజలకు ఇస్తామని ప్రకటించింది.వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు పత్రాలను చూపించిన వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. బీచ్‌లు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ ఇలా అన్నింటిలోకి ఎంట్రీ ఉంటుంది. పెండ్లిళ్లు, శుభకార్యాలు జరుపుకోవడానికి అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి కూడా వారికి అవసరంలేదు. ఈ విధానం అక్కడ బాగానే సక్సెస్‌ అవుతున్నది. మరోవైపు, టీకా వేసుకోని ప్రజలకు భారీ జరిమానాలను విధిస్తూ ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకున్నది.

Related Posts