YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ : సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ : సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ ఏప్రిల్ 15
పెరుగుతున్న కొవిడ్‌ కేసుల మధ్య ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని, ప్రస్తుతం ఐదువేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో కొవిడ్‌ పరిస్థితిపై గురువారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమయ్యారు.అతవ్యసరమైన సేవలను అందించే వారికి కర్ఫ్యూ పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మాల్స్‌, జిమ్‌లు, స్పాలు, ఆడోటోరియంలు పూర్తిగా మూసివేయనున్నట్లు చెప్పారు. సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తాయని, రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతించమని, కేవలం పార్శిల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 17వేలకుపై పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 104 మంది మరణించారు.

Related Posts