YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి... ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి...  ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్ ఏప్రిల్ 15
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని నిరసిస్తూ వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర షర్మిల దీక్షకు దిగారు. షర్మిల దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.షర్మిల దీక్ష శిబిరంలో ప్రత్యేక లుక్ తో ఆకట్టుకున్నారు. సాదాసీదా కాటన్ పోచంపల్లి చీరలో దర్శనమిచ్చారు. షర్మిల లుక్ శిబిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పుడూ చీక కట్టని షర్మిల కట్టు బొట్టు ప్రత్యేకంగా నిలిచాయి. నిమ్మపండు చీర నీలం అంచుతో షర్మిల హుందాగా కనిపించారు.ఈ సందర్భంగా దీక్ష స్థలంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ‘ఉద్యోగాలు రాక నిరుద్యోగులు చనిపోతుంటే కేసీఆర్ కు కనిపించడం లేదా? ’ అని ప్రశ్నించారు. మీరు గడిలో నిద్రపోతున్నారా? మీ చాతిలో ఉంది గుండెనా? లేక బండరాయినా? అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.దాదాపు 40 లక్షల మంది తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని..  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఇంత జరుగుతున్న దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని షర్మిల విమర్శించారు.నిరుద్యోగుల తరుఫున తాము నిలబడుతాం అని.. వారికి న్యాయం జరగాలని షర్మిల హామీ ఇచ్చారు. నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు బతికే వారని.. వారి కుటుంబాలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య పాల్గొని మద్దతు ప్రకటించారు.

Related Posts