YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపి.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలి

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపి.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలి

హైదరాబాద్ ఏప్రిల్ 15
గత ఏడాది ప్రపంచాన్ని వణికిపోయేలా చేసిన కరోనా మహమ్మారి మరోసారి తన విజృంభణను కొనసాగిస్తుంది.అయితే తాజాగా ఓ భయంకరమైన వార్త  వెలుగులోకి వచ్చింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోందని ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీచేశారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు.  ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు. ముందు ముందు ఆస్పత్రిలో బైడ్స్ కూడా దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని ఆయన వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్ డౌన్ కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదనీ కానీ తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలనీ ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని అన్నారు.

Related Posts