YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారతదేశ వృద్ధి సావుర్థ్యంపై ఐ.ఎం.ఎఫ్ ధీమా..

భారతదేశ వృద్ధి సావుర్థ్యంపై ఐ.ఎం.ఎఫ్ ధీమా..

భారతదేశ వృద్ధి సావుర్థ్యంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) ధీమా వ్యక్తంచేసింది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి)లో భారత్  2017-18లో 6.7 శాతం. 2018-19లో 7.4 శాతం వృద్ధి రేటు కనబరచగలదని అంచనా వేసింది. 2019లో భారత జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక దృక్పథ తాజా నివేదికలో ఐ.ఎం.ఎఫ్. అంచనా వేసింది. దీన్నిబట్టి 2018లోను, 2019లోను ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ భారతదేశవేునన్నమాట. ఈ టాప్ ర్యాంక్‌ని భారత్ 2017లో కొంత కాలం చైనాకు కోల్పోయింది.

‘ప్రవర్థమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల 2018 సంవత్సర, 2019 సంవత్సర సగటు వృద్ధి అంచనాలో ఎలాంటి మార్పూ లేదు...భారతదేశంలో మాత్రం వృద్ధి పుంజుకోవచ్చని భావిస్తున్నాం...’’ అని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదైలెన ఆ నివేదిక వెల్లడించింది. ఈ అంచనా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జి.డి.పి. వృద్ధి 6.5 శాతం ఉండగలదని కేంద్ర గణాంకాల కార్యాలయ అధికారిక అంచనాలకు అనుగుణంగానే ఉంది. వాషింగ్టన్ డి.సి. కేంద్రంగా ఉన్న ఐ.ఎం.ఎఫ్. 2017 అక్టోబరులో భారతదేశపు వృద్ధి అంచనాను తగ్గించింది. ‘‘2016 నవంబరులో ప్రవేశపెట్టిన కరెన్సీ మార్పిడి చర్యకు సంబంధించి కొనసాగుతున్న అవాంతరాలు, జాతీయ వస్తువులు, సేవల పన్ను ప్రవేశపెట్టడంతో పరిణామక్రమ వ్యయాలను’’ దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసినట్లు తెలిపింది. ఇదే ఐ.ఎం.ఎఫ్. భారతదేశపు జి.డి.పి. వృద్ధి 2017లో 7.2 శాతంగా, 2018లో 6.6 శాతంగా ఉండగలదని గత ఏప్రిల్‌లో అంచనా వేసింది. దీనికి విరుద్ధంగా, చైనా వృద్ధి మందగించగలదని, 2017లో ఉన్న 6.8 శాతం నుంచి 2018లో 6.6 శాతానికి, 2019లో మరింతగా క్షీణించి 6.4 శాతానికి తగ్గగలదని ఐ.ఎం.ఎఫ్. అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థైపెన మాత్రం ఐ.ఎం.ఎఫ్. మరింత ఆశాభావాన్ని కనబరచింది. ప్రపంచ ఉత్పత్తి 2018లో, 2019లో 3.9 శాతం చొప్పున పెరగగలదని అంచనాను పెంచింది. అక్టోబరులో వెల్లడించిన అంచనాకన్నా అది 0.2 శాతం ఎక్కువ. ప్రపంచ వృద్ధి 2017లో 0.1 శాతం పెరిగి 3.7 శాతంగా ఉండగలదని అది అంచనా వేసింది. ‘‘ఈ సవరణ ప్రపంచ వృద్ధి గతిలో పెరిగిన వేగాన్ని, ఇటీవల ఆమోదం పొందిన అవెురికా పన్ను విధాన మార్పులు చూపగల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని ఐ.ఎం.ఎఫ్. పేర్కొంది. అవెురికా పన్ను విధాన మార్పులు ఆర్థిక కార్యకలాపాలను ఉద్దీపింపజేయుగలవని తెలిపింది. కార్పొరేట్ ఆదాయ పన్నుల్లో కోత స్వల్పకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఉండవచ్చని చెప్పింది. అవెురికా 2017లో 2.3 శాతం, 2018లో 2.7 శాతం, తదుపరి సంవత్సరం 2.5 శాతం ఉండగలదని ఐ.ఎం.ఎఫ్. అంచనాను గణనీయంగా పెంచింది. 

Related Posts