YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో 50 కోట్ల పాత నోట్ల సంగతేంటీ

తిరుపతిలో 50 కోట్ల పాత నోట్ల సంగతేంటీ

తిరుమల, ఏప్రిల్ 16, 

హిందూమత ధర్మాన్ని ఉద్దరించే వాళ్లమని, దానికోసం అహర్నిశలూ పాటుపడతామని చెప్పుకునే బిజెపి ప్రభుత్వ పెద్దలు తిరుమలలోని వెంకన్న పట్ల కరుణ లేకుండా వ్యవహరిస్తున్నారు. టిటిడి వద్ద ఉన్న మలేషియా నాణేల మార్పుడికి, రద్దయిన పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇవ్వకుండా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. దీంతో, తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు వినియోగంలోకి రాకుండాపోతున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరి కారణంగా కోట్ల రూపాయల విలువైన విదేశీ నాణేలు చిల్లర పెంకులతో సమానమయ్యాయి. దేశ, విదేశాల్లోని భక్తులు కూడా ఎంతో భక్తితో స్వామివారి హుండీలో ఆయా దేశాల కరెన్సీ, నాణేలు కానుకగా వేస్తూ ఉంటారు. వీటిని మన దేశ కరెన్సీలో మార్చుకోవాల్సింది ఉంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నగదు వినియోగంలోకి రావడం లేదు. టిటిడి వద్ద మలేషియా నాణేలు 40 టన్నులకుపైగా నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. మలేషియా నాణేన్ని అక్కడ (రింగిట్‌) అంటారు. మన రూపాయితో పోల్చితే మలేషియా నాణెం (రింగిట్‌) విలువ రూ.17. మనకు పావలా, అర్ధ రూపాయి, రూపాయి నాణేలు ఉన్నట్లు మలేషియాలో ఐదు సెంట్లు, పది సెంట్లు, 20 సెంట్లు, 50 సెంట్లు ఉండేవి. ఈ నాణేలను మార్చాలని పలుసార్లు టిటిడి అధికారులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు.నోట్ల రద్దు సమయంలో తిరుమల శ్రీవారికి పెద్ద ఎత్తున పాత నోట్లను భక్తులు సమర్పించుకున్నారు. కేంద్రం ఆ పాతనోట్లను ఓ సమయం వరకే మార్పిడి చేసింది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో పాత నోట్లను కొంతమంది భక్తులు వేస్తూ వచ్చారు. అలా ఇప్పటికి రూ.యాభై కోట్ల వరకూ పోగుపడ్డాయి. వాటిని మార్చుకునే టిటిడి గతంలో చేసిన విజ్ఞప్తిని ఆర్‌బిఐ కూడా పట్టించుకోలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వద్దకు టిటిడి చైర్మన్‌ వెళ్లి విన్నవించారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌ వల్ల టిటిడికి ఆదాయ మార్గాలు లేకుండాపోయాయని, పాత నోట్లను మార్చి టిటిడిని ఆదుకోవాలని విన్నవించారు. అయినా, బిజెపి ప్రభుత్వంలో లేకుండాపోయింది. టిటిడికి ఉపయోగపడాలనే, మంచి కార్యక్రమాలకు వినియోగించాలనే ఉద్దేశంతో భక్తులు కానుకలు హుండీలే వేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో భక్తులు ఏ ఉద్దేశంతో కానుకలను స్వామి వారికి సమర్పించారో అది నెరవేరకుండాపోతోంది. మరో వైపు  బిజెపి పెద్దలు చెబుతున్న మాటలకు, ఆచరణకు కొద్దిగా కూడా పొంతన లేదు. హిందూ మత ఉద్దారకులుగా చెప్పుకునే వీరు వెంకన్నపై కొద్దిగా కూడా భక్తి లేదనే స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తల్చుకుంటే 40 టన్నుల మలేషియా నాణేలను, పాత నోట్లను మార్చడం పెద్ద కష్టం కాదు. ఇందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బట్టి వెంకన్నపై బిజెపికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది.

Related Posts