YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పారదర్శకంగా పాలన : సీఎం కేసీఆర్

 పారదర్శకంగా పాలన : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో పథకాలు చేపట్టాం. పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి  ఆవిర్భవించి ఇప్పటికి 17 ఏళ్లయ్యింది. ఆ సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్న ప్లీనరీలో ఒక సారి ఈ 17 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.  2014ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించామని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి, పాలనా సంస్కరణలలో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలు చేసినానని చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని కేసీఆర్ అన్నారు. . పాలన విషయంలో పారదర్శకంగా ముందుకు పోతున్నాం. సంక్షేమ పధకాలు ప్రజలకు అందుతున్నవి. అనేక సంవత్సరాలు గిరిజన బిడ్డలు గ్రామ పంచాయితి కావాలి అని కోరారు. .కానీ ఏ ప్రభుత్వం చేయలేదు. మేము చేసాం. జిల్లాలలో దశాబ్ది కాలంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్త జిల్లాల తరువాత అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కొంత మంది సాధ్యమా అన్నారు...కానీ మంచి పాలన అందుతుందని అయన స్పష్టం చేసారు. కర్ణాటక లో మాజీ ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ లో పధకాలు మా రాష్ట్రంలో ప్రజలు పెట్టాలి అని కోరుతున్నారని అన్నారు. మహా రాష్ట అధికారులు కూడా పధకాలు గూర్చి అడిగారు. గ్రామీణాభివృద్ధి ని చేస్తున్నాం. సమస్యల పోరాటం చేసే మంత్రులు,ఎంపీ లు మా ప్రభుత్వం లో ఉన్నారు. 75 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉంది..వాళ్ళ వల్లనే అభివృద్ధి సాధ్యం. 100 రోజులలో భూ రికార్డ్స్ ప్రక్షాళన చేసాం. మే 10 నుంచి రైతులకు చెక్ ల పంపిణీ చేస్తున్నామని అన్నారు. 

ఇప్పటికి 24 దేశాలలో తెరాస శాఖలను స్థాపించాం. 18 సంవత్సరం లో కి అడుగు పెట్టాం. పార్టీ పెట్టినా సమయం లో అందరూ హేళన చేశారు. 14 సంవత్సరాల పోరాటం తో తెలంగాణ సాధించాం. ఒంటరిగా పోటీ చేసిన ప్రజలు గెలిపించారు. నోరు కడుపు కట్టుకొని పని చేస్తున్నాని అయన అన్నారు. నిజాయితీగా దేశం లో పని చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మనదేనన్నారు. 

Related Posts