YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాతో బ్లాక్ దందా

కరోనాతో  బ్లాక్ దందా

హైదరాబాద్, ఏప్రిల్ 16, 
ప్రజారోగ్య వ్యవస్థలో ప్రయివేటు భాగస్వామ్యం పరిధిని మించి పోవడం దుష్పరిణామాలకు దారి తీస్తున్నది. ప్రాణాలను నిలబట్టే కీలకమైన ఔషధాలు సైతం మార్కెట్‌ నుంచి కనుమరుగవుతున్నాయి. కేవలం లాభాలే ప్రాతిపదికన ఔషధాలను ఉత్పత్తి చేయటం, నిలిపివేయటం వంటి మార్కెట్‌ జిమ్మిక్కులతో అకస్మాత్తుగా తలెత్తే అవసరాలను తీర్చలేకపోతు న్నాయి. కరోనా సీరియస్‌ రోగులకు డాక్టర్ల పర్యవేక్షణలో ఇచ్చే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ కోసం రోగులు తీవ్ర ఒత్తిడితో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. వారేమో దాని అసలు ధర రూ.5400 (200 ఎంజీ లేదా 20 ఎంఎల్‌) కన్నా ఐదు నుంచి పది రెట్లు అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుం టున్నారు. దీన్ని అదుపు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో కరోనా కేసులు అమాంతం తగ్గిపోవటంతో ఇక పెద్దగా మందుల అవసరం ఉండకపోవచ్చని భావించారు. సహజంగా ప్రయివేటు ఔషధ ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ మేరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఇచ్చే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ కోసం రోగులు తీవ్ర ఒత్తిడితో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. వారేమో దాని అసలు ధర రూ.5400 (200 ఎంజీ లేదా 20 ఎంఎల్‌) కన్నా ఐదు నుంచి పది రెట్లు అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుం టున్నారు. దీన్ని అదుపు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో కరోనా కేసులు అమాంతం తగ్గిపోవటంతో ఇక పెద్దగా మందుల అవసరం ఉండకపోవచ్చని భావించారు. సహజంగా ప్రయివేటు ఔషధ ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ మేరకు ఉత్పత్తి చేస్తుంటాయి. తగిన లాభాలున్నాయని భావించినప్పుడే విస్తృతంగా అమ్ముతాయి. ఒకవైపు కేసుల తగ్గుదలతో రెమిడెసివిర్‌ ఉత్పత్తి కూడా ఆ మేరకు తగ్గించినట్టు తెలిసింది. అదే సమయంలో విదేశాల నుంచి ఉన్న డిమాండ్‌తో కొంత మేరకు ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉన్నది. అయితే దేశంలో, రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ను మాత్రం చేరుకోలేదు.ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో 5767 మంది చికిత్స పొందుతుండగా వారిలో 1728 మంది వెంటిలేటర్‌ తో కూడిన ఐసీయూల్లో, 2612 మంది ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వాస్పత్రుల్లో 1326 మంది ఆక్సిజన్‌ బెడ్లపైన, 392 మంది వెంటిలేటర్‌ తో కూడిన బెడ్లపైన చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి రోజూ సీరియస్‌ కేసులు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఆ రోగుల్లో కొద్ది మందికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆరు రోజుల కోర్సు కింద ఇస్తున్నారు..అయితే కొన్ని చోట్ల మూడు రోజుల్లోనే వచ్చిన స్టాకు అయిపోయిందంటూ రోగుల బంధువులనే సమకూర్చుకోవాలని చెప్పటంతో ఆందోళన నెలకొంటున్నది. 
ఒకవైపు ప్రభుత్వ తప్పుడు విధానాలు, ప్రాణాలను నిలిపే ఔషధాలు (లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్స్‌) ఉత్పత్తికి ప్రయివేటుపై ఆధారపడటం ఇబ్బందికరంగా ఉంటే మరోవైపు బ్లాక్‌ మార్కెటింగ్‌ తో మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ తో కేంద్ర ప్రభుత్వం రెమిడెసివిర్‌ ఎగుమతులపై నిషేధం విధించింది. ఇంజెక్షన్‌ను ఓపెన్‌ మార్కెట్లో కాకుండా నేరుగా డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించిన ఆస్పత్రుల్లో రోగులకు ఉపయోగించేందుకు మాత్రమే వాడాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా బ్రోకర్ల వద్ద ఇంజెక్షన్లు దొరుకుతుండటంతో దీన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు ఉచిత సలహా పడేసి కేంద్రం చేతులు దులుపుకుంది. గతంలోనూ ఈ ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌ అవుతుందన్న విమర్శలతో అధికారులు హడావుడిగా కొన్ని ఆస్పత్రులను తనిఖీ చేశారు. అయితే మళ్లీ కరోనా రెండో దశ ప్రారంభమైంది. దీంతో రెమిడెసివిర్‌ కూ డిమాండ్‌ పెరిగింది. అలాగే బ్లాక్‌ మార్కెటింగ్‌ పంజా విసురుతోంది. ఇక దీన్ని నిలువరించి ప్రాణాపాయస్థితిలో ఉన్న అవసరమైన రోగులకు మందు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts