YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పవన్ తో సినిమానా... నా వల్ల కాదు

పవన్ తో సినిమానా... నా వల్ల కాదు

హైదరాబాద్, ఏప్రిల్ 16, 
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో ఒక్క‌సారి సినిమా చేస్తే చాలు అనుకునే దర్శకులు ఎంద‌రో ఉంటారు. కానీ వివాదాస్పద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం పవన్ ‌తో సినిమా చేయలేన‌ని, తన వల్ల కాదని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. దానికి గ‌ల కార‌ణాల‌ను కూడా చెప్పాడు. ఇంత‌కు ముందు ప‌వ‌న్‌కు, వ‌ర్మ‌కు గొడ‌వ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. వాళ్ల అమ్మ‌ను దూషించాడంట అప్ప‌ట్లో ప‌వ‌న్ ఫిల్మ్ సిటీలో నిర‌స‌న తెలిపిన విష‌యం పెద్ద దుమార‌పే రేపింది. ఇక అప్ప‌టి నుంచి ప‌వ‌న్ విష‌య‌లో ఆచితూచి మాట్లాడుతున్న వ‌ర్మ‌.. తాజాగా చేసిన కామెంట్లు చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. మూడేళ్ల విరామం తర్వాత ప‌వ‌న్ న‌టించిన ‘వకీల్‌ సాబ్’ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. త‌న ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన సినిమాపై పాజిటివ్ రెస్పాన్సే వ‌స్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్‌.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ మూవీలో చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజ‌యం నేప‌థ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పవన్‌కల్యాన్ తో తాను సినిమా చేయలేనని వర్మ కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశాడు. పవన్‌కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమని, వకీల్‌సాబ్ మూవీని తాను ఇంకా చూడలేదని చెప్పుకొచ్చాడు. అయితే రివ్యూలు విన్నానని తెలిపాడు. తాను తాజాగా దర్శకత్వం వహించిన ‘ఆర్‌జీవీ దెయ్యం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఈ విధ‌మైన కామెంట్స్ చేశాడు.

Related Posts