YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అడుగడున అడ్డు పడుతున్నారు ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కేసీఆర్

 అడుగడున అడ్డు పడుతున్నారు ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తెరాస ప్లినరీలో అయన మాట్లాడుతూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానిఫెస్టోలో  పెట్టిన అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక పార్టీ తెరాస అని అయన వివరణ ఇచ్చారు. 24 గంటల పాటు శ్రమిస్తూ కాళేశ్వరం పూర్తి చెస్తున్నాం. కర్ణాటక మంత్రి రెవన్న కరెంట్ ఇస్తున్నారు అని అంటే కాంగ్రెస్ వాళ్లు అధిష్టానానికి చెబుతాం అంటున్నారు. దేశం లో ఎక్కడ జరుగని విధంగా సొంత రాబడి తో దేశం లో మొదటిది తెలంగాణ అని అయన అన్నారు. 4వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆశా వర్కర్లకు దేశంలోనే అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నామని  చెప్పుకొచ్చారు. తెలంగాణను తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. దేశం లో ఏ రాష్టానికి రాని అవార్డ్స్ తెలంగాణ కి వచ్చాయి. అనేక అనుభవం తో దేశం లో జరుగవలసిన విధంగా పాలన జరుగడం లేదు. కాంగ్రెస్ బీజేపీ డ్రామా ఆడుతున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెడుతుంటే కాంగ్రెస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు.  ప్రోజెక్టులను అడ్డుకోవడానికి 250 కేసులు వేశారని విమర్శించారు.  ఉత్తమ్ కుమార్ కి టీపీసీసీ పదవి ఉంది అంటే గులాబీ జెండా ద్వారా ఆ పదవి వచ్చింది. లేదు అంటే సంచులు మోసే వారు అయ్యేవారని అయన అన్నారు. అబద్దాలు చెప్పడానికి తెలివి కావాలి. ఉత్తమ్ కి తెలివి తేటలు లేవని విరుచుకుపడ్డారు. సాయంత్రం 7 గంటలకు ప్రగతి భవన్ కి మీడియా ని తీసుకొని వచ్చి ప్రగతి భవన్ 15 రూములు చూపించు. లేకుంటే లేవు ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి అని అన్నారు. ఉత్తమ్ ఆరోపణలు నిరూపిస్తే,  8 గంటలకు సీఎం పదవి కి రాజీనామా చేస్తానని అయన సవాలు విసిరారు. కేంద్రం పెత్తనాలపై కుడా  కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన్…గ్రామాలలో రోడ్ల గురించి ప్రధాని కెందుకని ప్రశ్నించారు. ఏం సర్పంచ్ లేరా రోడ్లు వేయించేందుకు…స్థానిక సంస్థలంటే మీకు గౌరవం లేదా అని ప్రశ్నించారు.  గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, విద్యా, వైద్యం కేంద్ర ప్రభుత్వ హయంలో ఎందుకని అయన ప్రశ్నించారు

Related Posts