నర్సాపురం
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం వద్ద ఓఎన్జీసీ చేపట్టిన డ్రిల్లింగ్ లో అగ్నికీలలు ఎగిసి పడుతుండంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు . అయితే ఇది టెస్టింగ్ అని ఎన్జీసీ వర్గాలు పేర్కొంటున్నాయి . సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఈ విధంగా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఎన్జీసీ ప్రైవేట్ భాగస్వామ్యం తో కలిసి ఇక్కడ చమురు నిక్షేపాలు కోసం డ్రిల్లింగ్ చేపట్టింది. తవ్వకాలలో గ్యాస్ వెలుగుచూసింది .దీన్ని ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మంటలు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలియని స్థానికులు ఆందోళన చెందుతున్నారు