టీఆర్ఎస్ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్పై టీపీసీసీ నేత ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. ప్రగతిభవన్లో 150 గదులు ఉన్నాయని తాను అన్నట్టుగా కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని ఉత్తమ్ కొట్టిపారేశారు. ప్రగతి భవన్లో 150 గదులున్నాయని తాను అనలేదని స్పష్టం చేసారు. హెటిరో డ్రగ్స్ కంపెనీకి ఆయాచితంగా 15 ఎకరాల భూములు ఎందుకు కట్టబెట్టారు. అతి తక్కువ ధరకు ఖరీదైన ప్రాంతంలో భూమి ఎందుకు ఇచ్చారని ఉత్తమ్ కేసీఆర్ ను నిలదీసారు. వేల్స్ పన్ అనే కంపెనీ అత్యంత కాలుష్య కారక కంపెనీ కి అన్ని విధాలుగా రాయితీలు ఇచ్చారు. దాదాపు 40 కోట్లు నగదు రాయితీ ఇచ్చారు. 100 శాతం జి ఎస్ టీ రాయితీ, 100 ఎకరాల భూ కేటాయింపు చేసారు.ఇందుకు 3 జీవోలు ఇచ్చారు. ఇందులో అవినీతి ఉందని అయనఅన్నారు. కేటీఆర్ కు దోపిడీ విషయంలో జయేష్ రంజన్ అనే అధికారి పూర్తి గా సహకరించారు. త్వరలోనే ప్రభుత్వ అవినీతిని బయట పెడతాం. స్వతంత్ర భారతంలో కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో అవినీతి జరిగిందని అయన ఆరోపించారు. గతంలో ఎవరికి తెలియని విభాగాలు, రంగాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది. వేల కోట్ల రూపాయల ఒప్పందాలు హరీష్ రావు ఇంట్లో రాసుకున్నారు. మా ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఉత్తమ్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 800 ఎకరాల భూ పందేరం జరిగింది. ఇందులో కేటీఆర్ కు ఎంత ముట్టింది... జయేష్ రంజన్ కు ఎంత ముట్టిందని అయన అన్నారు. ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని నేను అనలేదు. అయినా ఒకటి మాత్రం నిజం.. ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి కేసీఆర్. దీన్నీ నిరూపించేందుకు నేను సిద్దం. ఆంధ్ర వాళ్లకు సంచులు మోస్తున్నది కేసీఆరే.... నేను కాదని అయన ఘాటుగా సమాధానమిచ్చారు.