YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేక కేసు...ఏం జరిగిందంటే

 వివేక కేసు...ఏం జరిగిందంటే

విజయవాడ, ఏప్రిల్ 16, 
సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ఏబీ వెంకటేశ్వరరావు సంచలన లేఖ రాశారు. వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని లేఖలో ప్రస్తావించారు. ఈకేసుకు సంబంధించిన తన వద్ద వివరాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎన్‌కే సింగ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదన్నారు. దర్యాప్తు అధికారికి రెండు సార్లు తెలిపినా స్పందించలేదన్నారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో ప్రస్తావించారు. హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే వరకు ఘటనా స్థలంలో ఎంపీ అవినాష్‌రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని చెప్పారు. ఆ సమయంలో మీడియా, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదని.. మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి నిఘా విభాగం అందజేసిందని తన లేఖలో వివరించారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని.. ఈ కారణంగానే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో ప్రస్తావించారు. వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్‌ విచారణకు హాజరైన సమయంలో కూడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించారు. మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనటంలో ఎంత నిజముందో.. తనపై వచ్చిన ఆరోపణల్లోనూ అంతే నిజముందన్నారు. వివేకా మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని ప్రచారం చేసిన వారే.. తనపైన దేశద్రోహం సహా ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారన్నారు ఏబీ. వివేకా తనకు మంచి స్నేహితుడని, మృదు స్వభావి అన్నారు. తాను కర్నూలు రేంజి డీఐజీగా పనిచేసిన సమయంలో తనకు ఆయన బాగా పరిచయమని చెప్పుకొచ్చారు.

Related Posts