YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారత్ లో భారీగా కేసులు... ఎగుమతి దేశాల్లో టెన్షన్

భారత్ లో భారీగా కేసులు... ఎగుమతి దేశాల్లో టెన్షన్


న్యూఢిల్లీ, ఏప్రిల్ 17, 
నిన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాలు అన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్ డొసులను లక్షలాదిగా బహుకరించడమో లేదా అమ్మడమో చేసిన భారత్ కు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా తాజాగా కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా ప్రబలడంతో సొంత అవసరాలకే ఈ వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా కథ అడ్డం తిరగడంతో కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులను, విక్రయాన్ని భారత్ నిలిపి వేయడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన భారత్ కు దాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తడం చాలా చెశాలకు మింగుడు పడటం లేదు.ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కొరత పెద్ద సమస్యగా మారుతోంది. గురువారం ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా కోవిడ్ కేసులు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భారత్ ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటున్నది. దేశీయంగానే వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్న కేసుల తీవ్రత నేపథ్యంలో వీటి పరిమాణం ఎంత మాత్రం సరిపోవడంలేదు. రోజూవారీ కేసులు పెరగడంతో పాటు ఆసుపత్రులు కూడా క్రిక్కిరిసి పోవడంతో అన్ని విధాలుగా కొరత పరిస్థితిని భారత్ ఎదుర్కొంటున్నది. తక్షణ ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే విధంగా నియమాలను సడలించింది. గతంలో ఫైజర్ వంటి విదేశీ మందుల కంపెనీలను తిరస్కరించిన భారత్ కు ఇప్పుడు దిగుమతులు శరణ్యం కావడంతో మార్గాంతరంపై దృష్టి పెట్టింది. భారత్ కు చిరకాల మిత్ర దేశమైన రష్యా కు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఒక్కసారిగా పరిస్థితితులు తారుమారు కావడంతో దేశీయంగా కోవిడ్ ను ఎదుర్కొనే ప్రయత్నాలు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తోంది దాదాపు 60 పేద దేశాలలో భారత్ సారధ్యంలో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. కోవాక్స్  కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మందులను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి వ్యాక్సిన్ కూటమి చేపట్టింది.అయితే భారత్ నుంచి భారీ పరిమాణంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతోనే కోవాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఔషధాల రంగంలో ఆసియా ఖండంలోనే బలమైన శక్తిగా ఉన్న భారత్ తమను ఈ ఆపద సమయంలో ఆదుకుంటుందని ఎన్నో దేశాలు ఆశించాయి. కానీ ఇప్పుడు భారత్ కే వాటిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 1.2 మిలియన్ వ్యాక్సిన్ డోసులనే భారత్ ఎగుమతి చేసింది. ఈ ఏడాది జనవరి మార్చి మధ్య దాదాపు 64 మిలియన్ డోసులను ఎగుమతి చేసిన భారత్ సొంత అవసరాలపైనే దృష్టి పెట్టడం, దీనిపై ఆధారపడిన దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉన్నందువల్ల దేశీయ అవసరాలకే మందులు సరిపోవడం లేదని ఎగుమతులపై ఇతర దేశాలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని ఓ అధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను భారత్ దిగుమతి చేసుకోవలసి రావడం అనివార్యమైందని పేర్కొన్న ఓ అధికారి "మా అవసరాలే తీరనప్పుడు ఇతర దేశాలకు ఎలా ఎగుమతి చేస్తాం" అని వ్యాఖ్యానించారు.

Related Posts