YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విజయమ్మతో షర్మిల... ఎవరికి లాభం..ఎవరికి నష్టం

విజయమ్మతో షర్మిల... ఎవరికి లాభం..ఎవరికి నష్టం


హైదరాబాద్, ఏప్రిల్ 17, 
లాభ‌మేంటి న‌ష్ట‌మేంటి. విజ‌య‌మ్మ ఎవ‌రు..ష‌ర్మిల త‌ల్లి. అంటే.. కూతురు పార్టీ పెట్టి పోరాడుతుంటే... నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష‌లు చేస్తుంటే.. సొంతంగా సీఎం కావాలి అని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. అమ్మ అన్నాక కూతుర్ని ఎంక‌రేజ్ చేయాలి. అండ‌గా ఉండాలి. ఏ క‌న్న త‌ల్లికి అయినా.. ఇంత‌కంటే ఎక్కువ ఆశ ఏముంటుంది చెప్పండి. అవును స‌రే.. ఇప్పుడు విజ‌య‌మ్మ‌ని వైసీపీ లీడ‌ర్ గా చూడాలా... ష‌ర్మిల అమ్మ‌గా చూడాలా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్. అస‌లు జ‌నం ఎలా చూస్తారు అనేది ఇంకా ఇంట్ర‌స్టింగ్ పాయింట్. పొలిటిక‌ల్ అన‌లిస్టుల నుంచి ఇంకో వ‌ర్ష‌న్ కూడా వినిపిస్తోంది. ష‌ర్మిల పార్టీ పెడుతున్న టైంలో.. ప‌క్క‌నే ఉంటే ఎలాంటి ప్రాబ్ల‌మూ ఉండ‌దు. సంక‌ల్ప స‌భ‌లో కూడా క‌రెక్ట్ కాదు.. ఎందుకంటే అది పార్టీ ప్రారంభం కాదు. విజ‌య‌మ్మ మామూలు తల్లిగా ఉంటే ఇలాంటి స్పెక్యులేష‌న్స్ ఉండ‌వు.కానీ.. ఆమె వైసీపీ కీల‌క లీడ‌ర్. చైర్ ప‌ర్స‌న్. సో.. ఆమె సంక‌ల్ప స‌భ‌కి రావ‌డంపైనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ.. మొద‌టి స‌భ కాబ‌ట్టి.. కుమార్తె పార్టీ పెడుతూ మొద‌టి స‌భ‌కి రాకుంటే ఎలా అనుకున్నారు. కానీ.. ష‌ర్మిల దీక్ష‌కి కూడా వ‌చ్చారు. ఆమె నిరాహార దీక్ష చేసుకోవ‌డం ఆమె పార్టీకి సంబంధించిన విష‌యం. మ‌రి ష‌ర్మిల దీక్ష చేస్తుంటే ప‌క్క‌నే ఎందుకున్నారు.. ఈమె వైసీపీ లీడ‌ర్ క‌దా.. ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు క‌దా అనే వాదించే వారు పెరిగారు. మ‌రి కుమార్తె నిరాహార దీక్ష చేస్తుంటే.. త‌ల్లిగా ప‌క్క‌నే ఉండి కంటికి రెప్ప‌లా చూసుకోవాలి క‌దా అనే వాద‌న వ‌స్తుంది.ఇవ‌న్నీ వదిలేస్తే.. ఇక్క‌డో ప్రాబ్ల‌మ్ ఉంది. వైసీపీకి తెలంగాణ‌లో నెగ‌టివిటీ వ‌చ్చింది. బోర్డ‌ర్ ఏరియాల్లో ఏదో ఒక‌టీ రెండు చోట్ల అభిమానులు ఉన్నా.. తెలంగాణ వ్యాప్తంగా వైసీపీ పై నెగ‌టివిటీ ఉంది. పైగా ష‌ర్మిల‌ను ఆంధ్ర లీడ‌ర్ ఆంధ్ర లీడ‌ర్ అంటున్నారు. ఇప్పుడు వైసీపీ లీడ‌ర్ గా ఉన్న విజ‌య‌మ్మ ఎప్పుడూ ప‌క్క‌నే ఉంటుంటే.. ష‌ర్మిల పార్టీ కూడా వైసీపీ పార్టీనే అనే ఫీలింగ్ క‌లుగుతోంది జ‌నాల‌కి. ఆంధ్ర పార్టీ మ‌ళ్లీ వ‌స్తోంది అని ప్ర‌చారం చేసే వారికి ఛాన్స్ దొరుకుతుంది క‌దా. నేను తెలంగాణ బిడ్డని నేను తెలంగాణ బిడ్డ‌ని.. నేను జ‌గ‌న్ వ‌దిలిన బాణాన్ని కాదు.. నేనే ప్ర‌త్యేకంగా ఓ బాణం వ‌దులుతున్నా అనే ష‌ర్మిల మాట‌ల‌కి అర్దం లేకుండా పోతుంది క‌దా మ‌రి. కొన్ని కొన్ని చోట్ల‌.. ఎమోష‌నల్ బాండింగ్ కోసం.. కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి. త‌ల్లిగా విజ‌య‌మ్మ రావాలి అనుకున్నా.. వైసీపీ లీడ‌ర్ గా కాస్త దూరంగా ఉంటే ష‌ర్మిల‌కీ, ఆమె పార్టీకి క్వ‌శ్చ‌న్స్ త‌గ్గుతాయి అంటున్నారు. విమ‌ర్శ‌లు కూడా త‌గ్గే ఛాన్స్ ఉంది అంటూ.. ఆమె మంచి కోరే పొలిటిక‌ల్ అన‌లిస్టుల మాట‌.

Related Posts