YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

హిమాచల్ పాక్ సిగ్నల్స్

హిమాచల్ పాక్ సిగ్నల్స్

సిమ్లీ, ఏప్రిల్ 17,
ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం.. ఒక దేశంలోని మొబైల్ ఫోన్ నెట్ వర్క్ సిగ్నల్స్ బార్డర్ దాటి అవతలిదేశంలోకి 500 మీటర్ల దూరం మించి పోరాదు. కానీ.. పాకిస్తాన్ సిగ్నల్స్ మన దేశంలో ఏకంగా వందల కిలోమీటర్ల దూరం వరకూ వచ్చేస్తున్నయి! పాక్ బార్డర్ కు దాదాపు150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వద్ద పాకిస్తానీ మొబైల్ సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయని ఇటీవల కొందరు ట్రెక్కర్లు గుర్తించారు. కంగ్రా జిల్లా హెడ్ క్వార్టర్స్ ధర్మశాలకు 26 కి.మీ. దూరంలోని కరేరి ఏరియాలో పాక్ సిగ్నల్స్ ను గుర్తించినట్లు జిల్లా అధికారులు కేంద్ర టెలికం డిపార్ట్ మెంట్ కు తెలియజేశారు. సముద్ర మట్టానికి 2900 మీటర్ల ఎత్తులో ఉన్న కరేరి ఏరియాలో మన దేశంలోని టెలికం కంపెనీల సిగ్నల్స్ ఏవీ రావడం లేదని తెలిపారు. పాక్ సిగ్నల్స్ అందిన వెంటనే మొబైల్ ఫోన్లలో టైం కూడా పాక్ స్టాండర్ట్ టైంకు మారిపోయిందని చెప్పారు. ధర్మశాల ఏరియాలో 2018లోనూ పాక్ సిగ్నల్స్ ను గుర్తించారు. పాకిస్తాన్ లో టెలికం సర్వీసులు అందిస్తున్న చైనా కంపెనీలు జాంగ్, యూఫోన్, మొబిలింక్ తో పాటు టెలినార్ కంపెనీ సిగ్నల్స్ కూడా పాక్ నుంచి ధర్మశాల దగ్గరి వరకూ వచ్చినట్లు గుర్తించారు. ప్రవాసంలో ఉన్న టిబెటన్ లీడర్ దలైలామా ధర్మశాలలోనే నివసిస్తుండటంతో ఈ ప్రాంతం హైలీ సెన్సిటివ్ జోన్ లో ఉంది. ఇక్కడికి దగ్గర్లోనే పాక్ మొబైల్ సిగ్నల్స్ వస్తుండటంతో వీటిని టెర్రరిస్టులు వాడుకోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts