YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

పద్మశ్రీ వివేక్ కన్నుమూత

పద్మశ్రీ వివేక్ కన్నుమూత

చెన్నై
ప్రముఖ తమిళ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్ (59) గుండెపోటుతో చెన్నైలో శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు కన్నుమూశారు. గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆయన శుక్రవారం ఉదయం సాలి గ్రామంలోని తన ఇంట్లో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే, కోవిడ్ టీకా కు గుండెపోటు సంబంధం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం ఉదయం వివేక్ కన్నుమూశారు. ఆయనకు భార్య అరుళ్ సెల్వి, ముగ్గురు పిల్లలున్నారు. 1987 లో విడుదల అయిన మనతిల్ ఒరుతి వేండ్రుం అన్న సినిమాతో అయన అరంగేట్రం చేసారు. అంతకుముందు అయన దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయకుడుగా, స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసారు .గురువారమే అయన కోవిడ్ వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అయన వ్యాక్సిన్ వేసుకున్నారు.
ఆరేళ్ల ముందు వివేక్ కుమారుడు డెంగీ జ్వరంతో మృతి చెందాడు. అప్పటి నుంచి వివేక్ దిగులుతో సినిమాలు చేయడం తగ్గించారు. ఆయనకు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనే వారు. పర్యావరణ కార్యకర్తగా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. రజనీ కాంత్, కమల్ హాసన్తో ఆయన చాలా చిత్రాల్లో నటించారు. అపరిచితుడు, శివాజీ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది.  2009లో ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదునిచ్చింది.

Related Posts