కర్నూలు
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఎపి జిబిలో 1.3 కేజీ బంగారం గల్లంతు అయింది. మండల కేంద్రమైన ఉయ్యాలవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ లో 1.3 కేజీ బంగారం మాయమైంది. శుక్రవారం ఒక రైతు తన బంగారు లోన్ రెన్యూవల్ చేసేందుకు రావటం తో అ రైతు బంగారం కనిపించలేదు. స్థానిక మేనేజర్ మధుసూదన్ నంద్యాల ఆర్ఎం కు సమాచారం అందించారు. ఆర్ ఎంజెఎల్ఎన్ ప్రసాద్ ఉయ్యాలవాడ బ్యాంక్ కు చేరుకొని వెరిఫై చేయగా 1.3 కేజీ గోల్డ్ గల్లంతు అయినట్లు గుర్తించారు. ఆర్ఎమ్ మరియు మేనేజర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశారు.