రాజధాని నిర్మాణంలో సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 5 టవర్లలో 69 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సచివాలయం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,176 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఏర్పాటు చేశారు. జీఏడీ టవర్ (50 అంతస్థులు) నిర్మాణం వ్యయం రూ.530 కోట్లు కాగా, 40 అంతస్థుల చొప్పున మిగిలిన నాలుగు టవర్లు నిర్మించనున్నారు. 1, 2 టవర్ల నిర్మాణ వ్యయం- రూ. 895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణ వ్యయం- రూ. 751 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 16 వరకు గడువు విధించారు.