YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఘనంగా నివాళులు

మాజీ రాష్ట్రపతి  సర్వేపల్లి రాధాకృష్ణన్ ఘనంగా నివాళులు

డోన్
డోన్ పాత పేట  లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల   ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన భారత రత్న, భారత దేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ 1888 సెప్టెంబర్ 5 న తిరుత్తణి లో జన్మించిన రాధాకృష్ణన్ గారు అనేక ఉన్నత చదువులు చదువుకుని, ఫిలాసఫర్ గా పనిచేసి, అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు, ఈ క్రమంలో ఆయనను నాటి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేసినారు..ఆ తరువాత రాష్ట్రపతిగా  ఎన్నికయ్యారు. ఆయన శిష్యులు పుట్టినరోజు ను జరుపుకోవాలని కోరగా, అందుకు ఆరోజును అంటే సెప్టెంబర్ 5 ను టీచర్స్ డే గా జరుపమన్నారు. ఆయన చివరకు 1975 ఏప్రిల్ 17 నా పరమపదించారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, లక్ష్మయ్య, రవిశేఖర్, చంద్రశేఖర్ గౌడ్, రమేష్, భాను ప్రకాష్ రెడ్డి, దేవేంద్రప్ప రాఘవేంద్ర, లీలావతి, శ్రీనివాసులు, రాధ, శ్రీ కళ, లక్ష్మి ప్రభావతి సుబ్రహ్మణ్యం నూర్జహాన్ వెంకటేశ్వర్లు మురళి తదితరులు పాల్గొన్నారు.

Related Posts