న్యూఢిల్లీ ఏప్రిల్ 17
వాట్సాప్ యూజర్లకు భారత సైబర్ సెక్యూటీ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ ఏజెన్సీ సీఈఆర్‌టీ కోరింది. వాట్సాప్ యాప్‌లో కొన్ని లోపాలను గుర్తించామని, వాటి వల్ల యూజర్ల సమాచారం లీకయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే లేటెస్ట్ వర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ సంస్థ సీఈఆర్‌టీ పేర్కొన్నది. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. భారత ప్రభుత్వ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధీనంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పనిచేస్తుంది. కంప్యూటర్ సెక్యూర్టీ సమస్యలు, లోపాలను సరి చేసి దేశవ్యాప్తంగా పటిష్టమైన ఐటీ సెక్యూర్టీ విధానాలు అమలు అయ్యేలా సీఈఆర్‌టీ చూస్తుంది.