
ముంబై ఏప్రిల్ 17
ప్రముఖ నటుడు, కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లో ఒక ప్రకటన చేశారు.‘కొవిడ్-పాజిటివ్, మూడ్ & స్పిరిట్-సూపర్ పాజిటివ్. అందరికీ హాయ్, ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముందుజాగ్రత్తగా చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’ అని సోనూసూద్ తన ప్రకటనలో పేర్కొన్నారు.